స‌ర్వే బాగున్నా టీడీపీలో కొత్త టెన్ష‌న్‌

ఏపీ అధికార పార్టీ టీడీపీ నేత‌ల్లో కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాలే వీరిలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు కార‌ణం అయ్యాయ‌ట‌! వాస్త‌వానికి తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలో టీడీపీ పాల‌న‌, చంద్ర‌బాబు నాయ‌క‌త్వం త‌దిత‌ర అంశాల్లో అన్నీ ప్ల‌స్సులో వ‌చ్చాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉద్య‌మం రేగిన కాపు సామాజిక వ‌ర్గంలోనూ టీడీపీకి సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని రిపోర్ట్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు స‌హా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద […]

నోట్ల ర‌ద్దు బాబుకు ముందే తెలుసు..ఎవిడెన్స్ ఇదిగో

గ‌డిచిన ప‌ది రోజులుగా దేశాన్ని అత‌లాకుతలం చేస్తున్న పెద్ద నోట్ల ర‌ద్దు సామాన్యుల నుంచి మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల వ‌ర‌కు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. చిల్ల‌ర దొర‌క‌క సామాన్యులు ఇబ్బందులు ప‌డుతుంటే.. పెద్ద నోట్ల హ‌డావుడితో అనేక ప‌రిశ్ర‌మ‌లు మూత‌బ‌డ్డాయి. ఇదిలావుంటే, ఈ నోట్ల ర‌ద్దు పై రాత్రి ఎనిమిది త‌ర్వాత స‌డెన్‌గా వెల్ల‌డించిన ప్ర‌ధాని మోడీ.. ఇలాంటి నిర్ణ‌యాల‌ను అక‌స్మాత్తుగా(స‌డెన్‌గా) వెల్ల‌డించ‌డం, అత్యంత ర‌హ‌స్యంగా ఉంచ‌డ‌మనే రెండు సూత్రాల ఆధారంగా ప‌ని చేశామ‌ని, అందుకే ఇప్పుడు ఇలా […]

చంద్ర‌బాబు చేతికి టీడీపీ న‌ల్ల‌ధ‌న ఎమ్మెల్యేల లిస్టు

ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు భారీ గా సంపాదించేశార‌ట‌! ఇక్క‌డ రాష్ట్రంలోనూ, అక్క‌డ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న‌ది తామే క‌దా అనుకున్నారో ఏమో.. తాము ఏం చేసినా అడిగేదెవ‌రు అని భావించారో ఏమో.. అడ్డ‌గోలుగా అందిన‌కాడికి దోచేశారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల‌కు చెందిన 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రెండు చేత‌లా సంపాదించేశారు. అందిన‌కాడికి అన్ని ప‌నుల్లోనూ క‌మీష‌న్లు కొట్టేశారు. బెదిరించి, దందాలు చేసి మ‌రీ బ్లాక్ మ‌నీకి పోగేసుకున్నారు. అయితే, వీరంతా ఒక్క‌సారిగా ప్ర‌ధాని […]

కోన‌సీమ‌లో టెన్ష‌న్‌…. హైటెన్ష‌న్‌

తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌చ్చ‌ద‌నం ప‌ర‌వ‌ళ్లు తొక్కే.. కోన‌సీమ‌లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా.. ఠ‌క్ ఠ‌క్ ఠ‌క్ మ‌నే పోలీసు బూటు చ‌ప్పుళ్లు హోరెత్తిస్తున్నాయ్‌! ప్ర‌శాంత సీమ‌లో ఎవ‌రిని ప‌ల‌క‌ల‌రించినా టెన్ష‌న్‌.. ఏ కూడ‌లిలో చూసినా హై టెన్ష‌న్‌!! కాపు ఉద్య‌మ నేత, మాజీ మంత్రి ముద్ర‌గడ ప‌ద్మ‌నాభం రేప‌టి నుంచి(బుధ‌వారం) చేప‌ట్ట‌నున్న స‌త్యాగ్ర హ పాద‌యాత్ర నేప‌థ్యంలో పోలీసులు భారీ ఎత్తున కోన‌సీమ ప్రాంతంలో మోహ‌రించారు. అమలాపురం, రావులపాలెం, మంద‌ప‌ల్లి త‌దిత‌ర ప్ర‌ధాన ప్రాంతాల్లో అడుగడుగునా పికెట్లు […]

టీడీపీలో ఎమ్మెల్సీ ఫైట్ అదురుతోంది…!

ఎమ్మెల్సీ ప‌ద‌వుల కోసం టీడీపీలో పోరు పీక్ స్టేజ్‌కి చేరింది. పార్టీలో బ‌లంగా ఉన్న నేత‌ల మ‌ధ్య భారీ స్థాయిలో ఫైట్ జ‌రుగుతోంది. ఇక‌, కుల స‌మీక‌ర‌ణ‌లు, సిఫార్సులు కామ‌న్‌! తాజా అంచ‌నాల ప్ర‌కారం టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య‌ను బ‌ట్టి ఐదుగురు, గ‌వ‌ర్న‌ర్ సిఫార్సు చేసేవారు ఇద్ద‌రు మొత్తంగా ఏడుగురు ఎమ్మెల్సీల‌ను చంద్ర‌బాబు ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు నేత‌లు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ను మంత్రి వ‌ర్గంలోకి […]

నారాయ‌ణ‌మూర్తికి చంద్ర‌బాబు ఎంపీ సీటు ఆఫ‌ర్‌

ఉద్య‌మ సూరీడు, విప్ల‌వ మూవీల డైరెక్ట‌ర్ ఆర్ నారాయ‌ణ మూర్తికి చంద్ర‌బాబు ఎంపీ సీటు ఆఫ‌ర్ చేశార‌ట‌. అయితే, ఇప్పుడు కాదులేండి! గ‌తంలో.. అయితే, తాను పాలిటిక్స్‌కి ప‌నికిరాన‌నే ఉద్దేశంతో ఆయ‌న ఇచ్చిన ఆఫ‌ర్‌ని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు నారాయ‌ణ మూర్తి చెప్పారు. అంతేకాదు, ఈ ఆఫ‌ర్ ఒక్క‌సారి కాద‌ట‌.. చంద్ర‌బాబు ఇప్ప‌టికి మూడు సార్లు ఎంపీ సీటు ఆఫ‌ర్ ఇచ్చార‌ని చెప్పుకొచ్చారు నారాయ‌ణ మూర్తి. ఇటీవ‌ల ఆయ‌న ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. కాకినాడ పార్ల‌మెంటు స్థానం నుంచి త‌న‌ను […]

అక్క‌డ బాబుకు రోజుకో త‌ల‌నొప్పి

విప‌క్షాధినేత జ‌గ‌న్ గ‌తంలో.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డం త‌న‌కు నిమిషాల‌మీద ప‌ని అంటూ… అహంకారంతోనో.. లేక రాజ‌కీయ అప‌రిక్వ‌త‌తోనో చేసి వ్యాఖ్య‌లు అంద‌రికీ గుర్తుండే ఉంటాయి. అదే స‌మ‌యంలో ఇటు  మిత్ర ప‌క్షంగా ఉన్న బీజేపీ సైతం ఏపీలో సొంతంగా బ‌ల‌ప‌డేందుకు మొద‌లుపెట్టిన ప్ర‌య‌త్నాలు చూశాక.. వారి ప్ర‌య‌త్నాల‌కు ఆదిలోనే గండి కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా … రాజ‌కీయ చాణ‌క్యుడుగా పేరున్న‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కార్య‌క్ర‌మానికి తెర లేపారు. ఫ‌లితంగా.. కొద్దిరోజుల్లోనే వైసీపీనుంచి మూడో వంతు […]

ఏపీలో ఐటీ డ‌వ‌ల‌ప్‌మెంట్ బాబుకు క‌త్తిమీద సామే

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఐటీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ ఎవ‌రంటే అంద‌రూ ఖ‌చ్చితంగా చంద్ర‌బాబునాయుడి వైపే చూస్తారు. ఎందుకంటే భాగ్య‌న‌గ‌రానికి ఐటీ కంపెనీల‌ను తీసుకురావ‌డంలోను, హైద‌రాబాద్‌ను సైబ‌రాబాద్‌గా మార్చ‌డంలోను చంద్ర‌బాబునాయుడు చూపిన చొర‌వ,  చేసిన కృషి అంత త్వ‌ర‌గా ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం ప్ర‌తి ప‌ల్లెనుంచీ ప‌దుల సంఖ్య‌లో ఐటీ నిపుణులు దేశ‌వ్యాప్తంగా ఆ మాట‌కొస్తే ప్ర‌పంచం న‌లుమూల‌లా ప‌ని చేస్తున్నారంటే అది ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు చ‌ల‌వే. అయితే, తెలంగాణ ఏర్ప‌డ్డ త‌రువాత ఏపీలో కేవ‌లం ఏవో […]

ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌పై కొత్త చ‌ర్చ‌

ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌పై కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. మొత్తం 11 మునిసిపాలిటీలు, 5 కొర్పొరేష‌న్ల‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ రానున్న రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. వాస్త‌వానికి న‌వంబ‌రు 30లోగా దీనిపై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుని త‌మ‌కు చెప్పాల‌ని హైకోర్టు ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌మాయత్తం అవుతోంది. అయితే, 2014 ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో జ‌రుగుతున్న తొలి ఎన్నిక‌లు కావ‌డం, […]