సంచలన నిర్ణయాలతో దేశ గతినే మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని మోదీ! ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. కానీ వాటిని కనిపించకుండా చేస్తున్నారు ఇద్దరు చంద్రులు! ఇప్పుడు వీరికి మరో పిడుగులాంటి వార్త! రాజకీయంగా పార్టీల అస్థిత్వంపై దెబ్బకొట్టే నిర్ణయాన్ని మోదీ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఇప్పటివరకూ ప్రభుత్వాలు ఎమ్మెల్సీ ద్వారా కొందరిని మండలికి పంపుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దుచేయాలని మోదీ నిర్ణయించుకున్నారట. అంతేగాక దీనిపై […]
Tag: bjp
బీజేపీని వదిలించుకునే పనిలో టీటీడీపీ
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సూత్రాన్ని టీటీడీపీ వంటబట్టించుకుంది. గత ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో జత కట్టినా.. ప్రస్తుతం మిత్ర బంధం తెగిపోయేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అస్థిత్వం కోసం జరిగే పోరాటంలో కొత్త మిత్రుల వేటలో టీటీడీపీ నేతలు వెదుకులాట ప్రారంభించారు. టీడీపీకి శత్రువయిన కాంగ్రెస్‌తో జతకట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని పరోక్షంగా అధినేత చంద్రబాబు ముందు ఉంచడం ఇప్పుడు […]
కేజ్రీవాల్‌తో బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్
పార్టీలో కుమ్ములాటలు.. సొంత నాయకుల మధ్యే అభిప్రాయభేదాలు.. నేతలపై కేసులు.. వెరసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి.. `సామాన్యుడి`ని తీవ్రంగా వేధిస్తున్నాయి. అంతేగాక ఆయన సీఎం పీఠానికి ఎసరు పెట్టేలా చేస్తున్నాయి. బీజేపీ హవా దేశంలో నడుస్తున్న రోజుల్లో.. దానిని తట్టుకుని సీఎం పీఠాన్ని ఎక్కడమంటే మామూలు విషయం కాదు! అందులోనూ ఒక సామాన్యుడు గెలవడమంటే దేశం మొత్తం నివ్వెరపోయింది. కానీ అప్పుడు పొగిడిన వాళ్లే ఇప్పుడు తిడుతున్నారు. ఆమ్ ఆద్మీ అంటూ స్థాపించిన పార్టీకి ఆ […]
సైకిల్ గుర్తు వద్దు.. కమలంపై పోటీ చేస్తాం
బీజేపీ-టీడీపీ పొత్తు రెండు రాష్ట్రాల్లో వింతగా ఉంది. ఒకచోట టీడీపీ బలంగా ఉంటే.. మరోచోట బీజేపీ బలాన్ని పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకచోట సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ఆరాటపడుతుంటే.. మరోచోట అస్థిత్వం కోసం టీడీపీ పోరాడుతోంది. కలహాలు ఉన్నా ఏదోలా ఇన్నాళ్లూ జోడీ బండిని లాక్కుంటూ వస్తున్నారు. ఏపీలో పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం వింతైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీపీ నాయకులు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారట. పార్టీని విలీనం చేయకుండానే.. బీజేపీ జెండాతో […]
మోదీ నిర్ణయానికి చంద్రబాబు సై.. లోకేష్ నై
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, పంచాయతీ,ఐటీ శాఖ మంత్రి లోకేశ్.. రోజుకో సంచలన వ్యాఖ్యతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సమావేశాల్లో తడబడుతూ వ్యాఖ్యలు చేసి తండ్రికి తలనొప్పులు తీసుకొచ్చిన ఆయన.. మరోసారి చంద్రబాబుకు పెద్ద ఝలక్ ఇచ్చారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అదే సమయంలో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చెబుతుంటే.. ఈ రెండిటినీ లోకేష్ తేలికగా కొట్టిపారేశారు. అసలు ఏకకాలంలో అన్నిరాష్ట్రాలకూ ఎన్నికలు నిర్వహించడం జరిగే పనికాదని కొట్టిపారేశారు!! […]
టీడీపీ-బీజేపీ కలిసి ఉంటే లాభం.. విడిపోతే నష్టం
`కలిసి ఉంటే కలదు సుఖం` ఇప్పుడు ఈ సూత్రం బీజేపీకి కరెక్ట్‌గా నప్పుతుంది. ముఖ్యంగా ఏపీలో ఇది మరింత సూటవుతుంది. టీడీపీతో ఎప్పుడుప్పుడు విడిపోయి.. సొంతంగా ఎదగాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఉత్సాహంగా ఉన్నారు. కానీ విడిపోతే లాభం కంటే నష్టమే ఎక్కువగా జరగవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ మూడేళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మోడీపై పొగడ్తల వర్షాన్ని కురిపించారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ […]
కన్నాకు జగన్ బంపర్ ఆఫర్
గత ఎన్నికల్లో విజయానికి చివరి మెట్టు వరకూ వచ్చిన వైసీపీ.. ఈ సారి ఎలాగైనా విజయతీరాలను అందుకుని అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అంతేగాక రాజధాని ప్రాంతంలో పట్టు కోసం వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత జగన్ ఇప్పుడు.. తన తండ్రి వైఎస్‌కు అత్యంత ఆప్తులుగా పేరొంది, ఇతర పార్టీల్లో చేరిన నేతలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ […]
తెలంగాణలో బీజేపీతో అంటకాగితేనే టీడీపీకి లైఫ్!
దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు నాట అప్రతిహతంగా చక్రం తిప్పిన తెలుగు దేశం పార్టీ.. రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమం దెబ్బతో ప్రస్తుతం విలవిలలాడిపోతోంది! ఏపీలోని 13 జిల్లాల్లో అధికారం చేపట్టి చక్రంతిప్పుతున్నా.. అదే తెలంగాణలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా మారింది. హైదరాబాద్‌ని నేనే అభివృద్ధి చేశానని, తెలంగాణలో తన ముద్ర శాశ్వతమని పదే పదే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కనీసం కన్నెత్తి […]
తమిళ తెరపై కాషాయ సినిమా మొదలైందా..?
తమిళనాడు రాజకీయాలను తెర వెనుక నుంచి నడపాలని ఎప్పటినుంచో వ్యూహాలు రచిస్తున్న బీజేపీ.. ఎట్టకేలకు విజయం సాధించింది. నయానో భయానో చివరికి పరిస్థితులను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకుని సక్సెస్ అయింది. తన మార్క్ వ్యూహంతో కేంద్రం పక్కాగా.. శశికళ వర్గాన్ని తమిళ రాజకీయాల నుంచి సైడ్ అయిపోయేలా చేసింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక వాయిదా వేయడం మొదలుకుని.. సీఎం పళనిస్వామి నేరుగా మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో కలిసేలా చేసి తమిళ రాజకీయాలను శాసించే స్థాయికి […]
