మోడీ రాజ‌కీయం అదుర్స్‌ …మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి!

పాలిటిక్స్‌లో ఎవ‌రూ ప‌ర్మినెంట్ ఫ్రెండ్స్ ఉండ‌ర‌నేది మ‌రో సారి ప్ర‌ధాని మోడీ కూడా నిరూపించే ప్ర‌య‌త్నంలో ఉన్నారా? అంటే ఔన‌నే అనిపిస్తోంది. 2014లో చేతులు ప‌ట్టుకుని చెమ్మ‌చెక్క‌లాడిన టీడీపీ అధినేత బాబుతో బోరు కొట్టి.. వ‌దిలించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో త‌మ‌కు గిట్ట‌ని, త‌మ‌తో పొసగ‌ని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌తో దోస్తీకి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి తెలంగాణ అధికార టీఆర్ ఎస్.. ఎన్డీయేలో భాగ‌స్వామి కాదు. అయిన‌ప్ప‌టికీ.. మోడీ.. కేసీఆర్ స‌ర్కార్ ఏం […]

పురందేశ్వ‌రి వ్యాఖ్య‌లతో టీడీపీలో కలకలం

సొంత వ‌దినా, మ‌రిది అయినా మాజీ కేంద్ర మంత్రి, ప్ర‌స్తుత బీజేపీ నేత ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి, ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబాల మ‌ధ్య ఉప్పు నిప్పు వాతావ‌ర‌ణం ఉంది. ఈ రెండు కుటుంబాల వారు ఇటీవ‌ల స‌రిగా మాట‌లే లేవ‌న్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయంగా చంద్ర‌బాబుతో విబేధించి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ద‌గ్గుపాటి దంప‌తులు ప‌దేళ్ల పాటు అక్క‌డ మంచి పొజిష‌న్‌లో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరిన ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి రాజంపేట నుంచి ఎంపీగా పోటీచేసి […]

బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ న‌ష్ట‌పోయిందా?

బీజేపీ-టీడీపీల బంధం ఈనాటిది కాదు! ప్ర‌స్తుతం తీవ్ర అనారోగ్యంతో మంచంలో ఉన్న మాజీ ప్ర‌ధాని వాజ‌పేయి కాలం నుంచి టీడీపీ -బీజేపీల మ‌ధ్య బంధం ఉంది. ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో పొత్తు పెట్టుకుని చంద్ర‌బాబు గెలుపు బావుటా ఎగ‌రేశారు. అక్క‌డితో ఆగ‌కుండా కేంద్రంలోనూ బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లికి.. మంత్రి ప‌దవులు సైతం కొట్టేశారు. అదేవిధంగా ఏపీలోనూ బీజేపీ స‌భ్యుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇంత బ‌లంగా ఉన్న ఈ బంధం.. ఇప్పుడు బీట‌లు […]

త‌మిళ‌నాట.. క‌మ‌ల వికాసం!… నిజం చేసిన ప‌న్నీర్ ట్వీట్‌

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు స‌రికొత్త మ‌లుపు తిరుగుతున్నాయా? ద‌క్షిణాదిలో కేవ‌లం క‌ర్ణాట‌క‌, ఏపీల‌తోనే స‌రిపెట్టుకున్న బీజేపీ.. ఇప్పుడు తాజాగా త‌మిళ‌నాడులోనూ పాగా వేసేందుకు పావులు క‌దుపుతోందా? ఆ దిశ‌గా ప్ర‌ధాని మోడీ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? ఆయ‌నకు త‌మిళ‌నాడు మాజీ సీఎం, అమ్మ‌కు విధేయుడు ప‌న్నీర్ సెల్వ‌ల మ‌ధ్య పొత్తు విష‌యంలో రాజీకుదిరిందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. దీనికి ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న ప‌న్నీర్‌.. పెట్టిన ట్వీటే పెద్ద సాక్ష్యం. అయితే, ఆయ‌న ప్ర‌జాగ్ర‌హానికి గుర‌వ్వాల్సి […]

తెలంగాణ‌లో కేసీఆర్.. ఒంట‌ర‌వుతున్నారా..?

తెలంగాణ‌లో త‌న‌కంటూ తిరుగులేద‌ని భావించిన సీఎం కేసీఆర్‌కి ఇప్పుడు చ‌క్క‌లు క‌న‌బ‌డుతున్నాయా? రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు పూర్త‌యిన త‌ర్వాత నెమ్మ‌దిగా ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త మొద‌లవుతోందా? ఇప్పుడు ఓ ర‌కంగా తెలంగాణ‌లో కేసీఆర్ ఒంట‌రి అవుతున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. నిజానికి తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అనే మాట ఇప్పుడు నిజంగానే తిర‌గ‌బ‌డుతోంది! ఎన్నిక‌ల స‌మ‌యంలో బంగారు తెలంగాణ ల‌క్ష్యం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో చాలా మ‌టుకు ఇప్ప‌టికీ నెర‌వేర‌క‌పోవడం దీనికి ప్ర‌ధాన […]

గ్రేటర్ లో పాగా వేసేందుకు బీజేపీ బడా ప్లాన్

తెలంగాణ‌లో తిరుగులేకుండా జెట్ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోన్న అధికార టీఆర్ఎస్ దూకుడును నిలువ‌రించేందుకు విప‌క్ష బీజేపీ స‌రికొత్త అస్త్ర‌శ‌స్త్రాల‌తో సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే బీజేపీ తెలంగాణ‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలు, ప‌ట్ట‌ణాల్లో బ‌లోపేతం అయ్యేంద‌కు చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. టీఆర్ఎస్ బ‌ల‌హీనంగా ఉన్న గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను బీజేపీ మెయిన్‌గా టార్గెట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన సీనియ‌ర్ నాయ‌కులు అయిన మాజీ మంత్రులు దానం నాగేంద‌ర్‌, ముఖేష్‌గౌడ్‌, మాజీ […]

త‌మిళ‌నాట బీజేపీ ఆట షురూ?! 

`త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. అన్నాడీఎంకే అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో అస్స‌లు కేంద్రం వేలు పెట్ట‌దు. త‌మిళ‌నాట జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు కేంద్రానికీ ఎటువంటి సంబంధం లేదు` ఇదీ కొంత‌కాలంగా బీజేపీ పెద్ద‌లు, కేంద్ర మంత్రులు ప‌దే ప‌దే చెబుతున్న మాట‌. కానీ ఆ మాట‌ల‌న్నీ నీటి మూట‌లేన‌ని తేలిపోయింది. ఏకంగా స‌చివాల‌యంలోనే కేంద్ర‌మంత్రి.. రాష్ట్ర మంత్రులతో స‌మావేశ‌మ‌య్యే స్థాయిలో ఉన్నారంటే.. త‌మిళ‌నాట ప‌రిస్థితుల‌ను కేంద్రం ఎంత‌వ‌ర‌కూ త‌న చెప్పు చేత‌ల్లో పెట్టుకుంటే అర్థ‌మ‌వుతోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. `అమ్మ` […]

టీడీపీ మంత్రిని టార్గెట్ చేసిన బీజేపీ మంత్రి

ఏపీ రాజ‌కీయాల్లో ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ-టీడీపీ మ‌ధ్య మిత్ర బంధం తెగిపోయే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌..ప్ర‌ధాని మోదీతో భేటీ అనంత‌రం అటు బీజేపీ, ఇటు టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. అస‌లే హీట్ పెరిగిపోతున్న స‌మ‌యంలో కేబినెట్లోని బీజేపీ మంత్రి.. మ‌రో టీడీపీ మంత్రిని టార్గెట్ చేయ‌డం అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లు మారింది. మ‌ద్యం అమ్మ‌కాల విష‌యంలో తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం ఇప్పుడు చర్చ‌నీయాంశ‌మైంది. కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న […]

మాట‌లతో కానిది భేటీతో సాధ్య‌మైందా? 

మాట‌ల వ‌ల్ల చెప్ప‌లేనిది మీటింగుల వ‌ల్ల సాధ్య‌మ‌వుతుంది. ఇప్పుడు అలాంటి ఒకే ఒక్క మీటింగ్ ఏపీ రాజ‌కీయాల్లో సెగ‌లు పుట్టిస్తోంది. వైసీపీ నేత‌ల్లో జోష్ నింపుతోంది. ఇదే స‌మ‌యంలో టీడీపీ నేత‌లను తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. ప్ర‌ధాని మోదీతో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ భేటీ.. ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మార్చ‌బోతోంది. 2019లో జ‌గ‌న్ జైలుకు ఖాయ‌మ‌ని, ఇక అధికారం శాశ్వ‌తమ‌ని భావిస్తున్న నేత‌ల‌కు ఒక్క‌సారిగా గొంతులో వెల‌గ‌పండు ప‌డినంత ప‌నయింది. ఇదే సంద‌ర్భంలో పార్టీ అస్థిత్వాన్ని కాపాడుకునే […]