రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థికి తమ ఫుల్ల్ సపోర్టు ఉంటుందని.. ఎవరిని నిలబెట్టినా తమ మద్దతు ఇస్తామని అన్ని రాజకీయ పార్టీలకంటే ముందే చెప్పి ఆశ్చర్యానికి గురిచేశారు వైసీపీ అధినేత జగన్! రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును బీజేపీ ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ సహా.. అంతా అన్ని రాష్ట్రాల నేతలను కోరుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రామ్‌నాథ్‌తో భేటీ అవ్వడం ఇప్పుడు […]
Tag: bjp
ప్రెసిడెంట్ ఎలక్షన్‌లోనూ.. కాషాయం మార్క్ పాలిటిక్సే!!
ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ.. రాష్ట్రపతి భవన్ చుట్టూ తిరుగుతున్నాయి. జూలైలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్థానంలో మరో కొత్తవారిని కొలువుదీర్చాలి. దీనికి సంబంధించి ఇప్పుడు హస్తిన రాజకీయాలు బోగి మంట మాదిరిగా వేడెక్కాయి. అయితే, ఇక్కడే బీజేపీ సారధి అమిత్ షా, ప్రధాని మోడీల వ్యూహం వ్యూహాత్మకంగా సాగుతోంది! కరడుగట్టిన ఆర్ ఎస్ ఎస్ వాదులైన ఇద్దరూ తమకు అనుకూలురైన వ్యక్తిని రాష్ట్రపతి భవన్‌లో కూర్చోపెట్టాలని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఎన్డీయే […]
అమిత్‌షాపై టి-బీజేపీ నేతల గుస్సా!
తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తెలంగాణలో పర్యటించి శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోని సీనియర్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఆయన వ్యూహాలతో తమకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందో దక్కదోనని టెన్షన్ పడుతున్నారట. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యమిచ్చేలా అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటుండటంతో.. దిక్కుతోచని […]
ఏపీ బీజేపీలో ఒంటరైన వీర్రాజు
ఏపీలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్నా ఈ రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో పొసగడం లేదన్నది నిజం. ఏపీ బీజేపీ చంద్రబాబు అనుకూల, చంద్రబాబు వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. వీరిలో చంద్రబాబు వ్యతిరేకవర్గంలో ఆయన్ను, టీడీపీని టార్గెట్ చేసే వాళ్లలో రాజమండ్రికి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజుదే ఫస్ట్ ర్యాంకు. వీర్రాజుకు జాతీయ స్థాయిలో ఉన్న లాబీయింగ్‌తో ఇక్కడ టీడీపీ, చంద్రబాబుపై పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఒకానొక దశలో ఆయనకే ఏపీ బీజేపీ పగ్గాలు అన్న […]
జగన్‌ను ఓవర్ కాన్ఫిడెన్సే ముంచిందా…!
ఏపీలో 2019 ఎన్నికలు విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్‌కు చావో రేవో లాంటివి. ఈ ఎన్నికల్లో జగన్ గెలవకపోతే జగన్ పొలిటికల్ ఫ్యూచర్ చాలా డేంజర్ పొజిషన్లోకి వెళ్లిపోయేలా ఉంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్త వ్యూహాలను సైతం అమలు చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ప్రశాంత్ కిషోర్ వైసీపీ+ జనసేన+కామ్రేడ్లతో పొత్తు ఉంటేనే వైసీపీ నెక్ట్స్ అధికారంలోకి వస్తుందని జగన్‌తో చెప్పినట్టు కూడా ఏపీ పొలిటికల్ వర్గాల్లో ప్రచారం […]
దత్తాత్రేయ వర్సెస్ మురళీధర్ రావు
తెలంగాణలో బీజేపీకి ఉన్నది ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ….కానీ ఇక్కడ పార్టీలో 10కి పైగా గ్రూపులు ఉన్నాయి. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, జాతీయ నేత మురళీధర్ రావు, గ్రేటర్ హైదరాబాద్‌లో ద్వితీయ శ్రేణి నాయకులు ఇలా ఎవరికి వారు గ్రూపులుగా వ్యహరిస్తుంటే గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీరెవ్వరిని పట్టించుకోకుండా తాను ఓ సపరైట్‌గా వ్యహరిస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని గొప్పలకు పోతోన్న టీ బీజేపీ ఈ గ్రూపులతో పాతాళానికి పడిపోకుండా ఉంటే […]
బీజేపీని తొక్కే పనిలో చంద్రబాబు బిజీ
ఏపీలో మిత్రపక్షాలుగా ఉన్న అధికార టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ మధ్య పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం సఖ్యత లేదన్నది రాజకీయ ఓనమాలు తెలిసిన వాళ్లకు కూడా అర్థమవుతోంది. ఓ వైపు టీడీపీతో పొత్తు ప్రస్తుతానికి కంటిన్యూ అవుతున్నా బీజేపీ కూడా తన సొంత వ్యూహాలతోనే ముందుకెళుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బలపడాలన్నది బీజేపీ టార్గెట్. అందుకు అనుగుణంగా చాపకింద నీరులా బీజేపీ ఇక్కడ ప్లాన్లు వేస్తోంది. 2019 ఎన్నికల్లో పొత్తు ఎలా ఉన్నా అప్పటి వరకు […]
తెలంగాణపై కొత్త కండీషన్లు షురూ చేసిన అమిత్ షా
దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ, ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని పక్కా పథకంలో ఉన్నారు కమల నాథులు. ఇప్పటికే ఏపీలో చంద్రబాబుకు మద్దతు పలుకుతూ.. ఇద్దరూ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక, తెలంగాణలోనే పరిస్థితి అర్ధం కావడం లేదు. ఏపీ కన్నా తెలంగాణలో ఒకింత బలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. అధికారానికి మాత్రం చేరువ కాలేదు. ఈ క్రమంలోనే 2019లో ఎలాగైనా సరే తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు పట్టుపై ఉన్నారు. దీనికిగాను అధికారంలో ఉన్న టీఆర్ […]
బళ్లారిలో గాలి ఫ్యామిలీకి చెక్
కర్ణాటకలోని బళ్లారి జిల్లా పేరు చెపితే మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి పేరు ముందుగా గుర్తుకు వస్తుంది. బళ్లారి మైనింగ్ మాఫియాతో కోట్లకు పడగలెత్తి దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కిన గాలి కేవలం మంత్రిగా ఉండి కర్ణాటక రాజకీయాలను శాసించారు. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయ్యి గాలి జైలుకు వెళ్లడంతో అక్కడ గాలి ఊపు తగ్గింది. ఇక వచ్చే యేడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో మరోసారి గాలి బళ్లారిలో కీ రోల్ పోషిస్తాడా ? అన్న చర్చలు […]
