వైసీపీలో కేవీపీ బావ‌మ‌రిది స‌త్తా ఎంత ?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ అధికార వైసీపీలో కొద్ది రోజులుగా గ్రూపు రాజ‌కీయాల ర‌గ‌డ జ‌రుగుతోంది. ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ – మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మేడ‌వ‌ర‌పు అశోక్‌బాబు ( సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ కేవీపీ రామ‌చంద్ర‌రావు బావ‌మ‌రిది) ఓ వైపు .. చింత‌ల‌పూడి ఎమ్మెల్యే వీఆర్‌. ఎలీజా, ఆయ‌న అనుచ‌రులు మ‌రోవైపుగా ఉంటూ రాజ‌కీయం చేస్తూ వ‌స్తున్నారు. ఎంపీగా శ్రీధ‌ర్ ఉన్నా చింత‌ల‌పూడి వ‌ర‌కు అశోక్ వ్యూహాలు పార్టీలో ఎప్పుడూ కీల‌కంగానే […]

టీడీపీకి బిగ్ షాక్‌..పార్టీకి గోరంట్ల బుచ్చయ్య గుడ్‌బై?!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం టీడీపీ ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నాడు బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసినట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ నాయకత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్నారని, ఆ […]

నారా లోకేష్ అరెస్ట్.. రమ్య కుటుంబానికి మద్దతుగా నిలిచిన టీడీపీ..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో బీటెక్ అమ్మాయి రమ్య ఓ ఉన్మాది చేతిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజే దారుణ హత్యకు గురి కావడం బాధాకరం. ఈ ఉదంతంలో రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించి, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే తెలుగుదేశం […]

మంత్రులపై జగన్ అసహనం?

పులిచింతల ప్రాజెక్టులో 16వ నెంబరు గేటు నీటి ఉధ్రుతికి కొట్టుకుపోవడం.. దాని స్థానంలో స్టాప్ లాక్ అమర్చడం లాంటివి జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారం కేబినెట్ మంత్రులకు తలనొప్పి అయి కూర్చుంది. సీఎం జగన్ మంత్రుల వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలో ఈ వ్యవహారంపై ఇష్టానుసారం విమర్శలు చేస్తుంటే.. మంత్రలు మాత్రం చూస్తూ ఉండిపోయారని, తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆయన కోపానికి అసలు కారణం. కనీసం టీడీపీ, బీజేపీలు చేస్తున్న […]

ఢిల్లీ చుట్టూ చక్కర్లు.. అయినా రాలని కాసులు..

ఏపీ ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నెలకు ఒకటి, రెండు సార్లు హస్తినకు వెళ్లి వస్తున్నారు. ఆయన సమయమంతా ఢిల్లీకి వెళ్లి రావడానికే సరిపోతుంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థి బాగాలేదు.. నిధులు ఇవ్వండి అని కేంద్రప్రభుత్వాన్ని అడగడానికి, వినతిపత్రాలు ఇవ్వడానికి నిత్యం హస్తినకు వెళుతున్నారు. అయితే డిల్లీ పెద్దలు మాత్రం స్పందించడం లేదు. బుగ్గన పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్ర మంత్రులను కలిస్తే చాలురా దేవుడా.. అనే పరిస్థితి […]

పాపం.. లక్ష్మీపార్వతిపై అంబటికి ఎందుకో అంత కోపం..?

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి చైర్మన్ లక్ష్మీపార్వతికి ఇపుడు కొత్త చిక్కొచ్చి పడింది. అంత పెద్ద చైర్మన్ పదవిలో ఉన్న ఆమెను పార్టీలో పెద్దగా పట్టించుకోవడం లేదు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అయితే ఆమెను హేళనగా మాట్లాడారట. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానంటే.. పెద్దగా నవ్వి.. ప్రధాని, రాష్ట్రపతిలకు కూడా కంప్లైంట్ ఇచ్చుకో అన్నట్లు మాట్లాడాడట. ఇంతకీ విషయం ఏంటంటే.. లక్ష్మీపార్వతికి గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో 2.5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని ఆమె స్థానికంగా […]

ఈశ్వరా.. ఇదేమి నిర్ణయం అంటున్న వైసీపీ కార్యకర్తలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా నాయకులు ఏం చేయలేక.. అధినేతను అడగలేక మిన్నకుండిపోయారు. అసలేం జరిగిందంటే.. కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి ఛైర్మన్లను సీఎం ఇటీవల ఎంపిక చేశారు. అయితే వారు స్థానికేతరులు కావడంతో స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. శ్రీకాళహస్తి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా సత్యవీడుకు చెందిన బీరేంద్రవర్మ, కాణిపాకం ఆలయ చైర్మెన్ గా చిత్తూరుకు చెందిన ప్రమీళారెడ్డిలను అధినేత ఎంపిక చేశారు. […]

నిజంగానే ప్రత్యేక హోదాపై పోరాటమా.. లేక రాజకీయ నాటకమా..?

రాజ్యసభలో వైసీపీ సభ్యుల ప్రత్యేక హోదా పోరాటం నిజమేనా.. లేక అది రాజకీయ నాటకమా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరి పోరాటం ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే అతిథిలా ఉందంటున్నారు విమర్శకులు. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం వల్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. అధికారం ఇవ్వండి.. ఢిల్లీలో పోరాడతా అంటూ జగన్ పదే పదే చెప్పడంతో జనం అవకాశమిచ్చారు. అయితే బీజేపీకి జాతీయస్థాయిలో […]

బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన సీఎం జ‌గ‌న్‌..వీడియో వైర‌ల్‌!

ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, ప్రజా సంబంధ విషయాలతో తలమునకలుగా ఉంటారు. అటువంటి ఆయ‌న‌ తాజాగా బ్యాట్ ప‌ట్టి ఎంతో ఉల్లాసంగా క్రికెట్ ఆడారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కడప జిల్లా పర్యటనలో భాగంగా తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సందర్శించారు.స్టేడియంలో అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం సరదాగా స్టేడియంలో క్రికెట్‌ […]