`పుష్ప‌`లో బోట్ ఫైట్‌.. సినిమాకే హైలెట్ అట‌!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా క‌నిపించ‌నున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప‌రాజ్‌గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి […]

విజయ్ `మాస్టర్‌` మూవీ అరుదైన రికార్డ్‌!

దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెర‌కెక్కించిన చిత్రం మాస్ట‌ర్‌. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విల‌న్ పాత్ర పోషించ‌గా..మాలవికా మోహనన్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా గ‌త ఏడాదే విడుదలకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా ప‌డుతూ ప‌డుతూ వ‌చ్చి చివ‌ర‌కు జనవరి 13న విడుద‌లైంది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం తమిళనాడులో రూ. 200 కోట్లు వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. మ‌రోవైపు ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ […]

సాయం చేయాల‌నే ఆలోచ‌న సోనూకు ఎలా వ‌చ్చిందో తెలుసా?

క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌ష్ట‌మ‌న్న చోట క‌లియుగ క‌ర్ణుడిగా వాలిపోతున్నాడు న‌టుడు సోనూసూద్‌. లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మందికి సేవ‌లు అందిస్తూ రియ‌ల్ హీరో అనిపించుకున్న సోనూ.. త‌న సేవా కార్యక్రమాలకు అస్సలు అంతమే లేదు అన్నట్లుగా రోజూ ఏదో ఒక కార్యక్రమంతో వార్తలలో నిలుస్తున్నారు. అయితే అస‌లు సోనూసూద్‌కు ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేయాల‌నే ఆల‌చ‌న ఎలా మొద‌లైంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలుసుకోవాల‌ని చాలా మందికి ఉంది. ఈ విష‌యంలోపై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో […]

తండ్రి కాబోతున్న జ‌గ‌ప‌తిబాబు..అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే?

జ‌గ‌ప‌తిబాబు తండ్రి కాబోతున్నాడ‌ట‌. ఈ వ‌య‌సులో తండ్రి కావ‌డం ఏంటీ? అన్న అనుమానం మీకు వ‌చ్చే ఉంటుంది. అయితే రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లో. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఫ్యామిలీ హీరోగా ఒక‌ప్పుడు సూప‌ర్ క్రేజ్ తెచ్చుకున్న జ‌గ‌ప‌తిబాబు.. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. దీంతో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటున్నాడీయ‌న‌. ఈ క్ర‌మంలోనే జగ్గూభాయ్ కు తాజాగా బాలీవుడ్ ఆఫ‌ర్ త‌లుపుత‌ట్టింద‌ని..స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా […]

నా శ‌రీరంపై దారుణంగా ట్రోల్స్‌ చేశారు..ప్రియ‌మ‌ణి ఆవేద‌న‌!

ఎవరే అతగాడు? సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప్రియ‌మ‌ణి.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే అగ్రహీలందరి స‌ర‌స‌న ఆడిపాడి స్టార్ హీరోయిన్‌గా పాపులర్ అయింది. అయితే ముస్తఫా రాజ్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన త‌ర్వాత ప్రియమణి సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చింది. అయితే ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మ‌డు.. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో య‌మా జోరు చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ […]

క‌ల నెర‌వేర్చుకున్న పూజా..సీక్రెట్స్ రివిల్ చేసిన బుట్ట‌బొమ్మ‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు అందుకున్నా దువ్వాడ జగన్నాధమ్(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ త‌ర్వాత పూజా వెనుదిరిగి చూసుకోలేదు. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో ఇలా వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అదే స‌మ‌యంలో తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక […]

ఆస్పత్రిలో ప్రముఖ క్రికెటర్.. ఎందుకంటే..?

క్రికెటర్లు గాయాలపాలవ్వడం ఈ మధ్య సాధారణమైపోయింది. అయితే ఒక క్రికెటర్ కి గాయం అయితే ఆ తర్వాత అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. తాజాగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయాల పాలయ్యాడు. పాకిస్థాన్​ సూపర్​లీగ్​లో శనివారం పీఎస్​ఎల్​లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున డుప్లెసిస్ మ్యాచ్ ఆడుతున్నాడు.​ ఆ టైంలో పెషావర్​ జల్మీతో జరిగిన మ్యాచ్​లో గాయాలపాలయ్యాడు. బౌండరీని ఆపేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అతడికి గాయమైంది.​ ఏడవ ఓవర్ […]

మహేష్ సరసన కృతిసనన్…?

తెలుగు సినీ ఇండస్ట్రీకి కృతిసనన్ మహేష్ బాబు సినిమా ద్వారా పరిచయం అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1-నేనొక్కడినే సినిమాలో ఈ హీరోయిన్ ఆరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లో తన మార్క్ తో దూసుకుపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో ఆమె నటిస్తోంది. ప్రభాష్ సరసన ఆదిపురుష్ లో కూడా ఈమెకు నటించే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు […]

పెళ్లిపై వనితా షాకింగ్ కామెంట్స్ ..?

వనిత విజయ్ కుమార్..ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వినపడుతోంది. ప్రముఖ సీనియర్ నటుడు అయిన విజయ్ కుమార్ కూతురే ఈమె. తెలుగులో దేవీ సినిమాలో హీరోయిన్ ప్రేమాకు అక్కగా నటించింది. అయితే ఈమె పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుందని పలువురు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వనిత కొన్ని టీవీ షోలల్లో నటిస్తోంది. ఆమె జీవితంలో గత కొన్ని రోజులుగా అనుకోని బాధలు చుట్టుముట్టినా ఎదురొడ్డి పోరాడుతోంది. మూడు […]