విజయ్ `మాస్టర్‌` మూవీ అరుదైన రికార్డ్‌!

June 14, 2021 at 8:52 am

దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెర‌కెక్కించిన చిత్రం మాస్ట‌ర్‌. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విల‌న్ పాత్ర పోషించ‌గా..మాలవికా మోహనన్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా గ‌త ఏడాదే విడుదలకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా ప‌డుతూ ప‌డుతూ వ‌చ్చి చివ‌ర‌కు జనవరి 13న విడుద‌లైంది.

భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం తమిళనాడులో రూ. 200 కోట్లు వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. మ‌రోవైపు ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా మ‌రో ఆరుదైన రికార్డ్ సృష్టించింది.

2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్‌ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్‌ విడుదల చేయ‌గా.. అందులో మాస్టర్‌ చిత్రం మొద‌టి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఆస్పిర్టన్స్‌ వెబ్‌సిరీస్, ది వైట్‌ టైగర్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తమన్నా నవంబర్‌ స్టోరీ, ధనుష్‌ కర్ణన్‌, పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌, ర‌వితేజ క్రాక్ ఆ త‌ర్వాతి స్థానాల‌ను ద‌క్కించుకున్నాయి.

విజయ్ `మాస్టర్‌` మూవీ అరుదైన రికార్డ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts