`పుష్ప‌`లో బోట్ ఫైట్‌.. సినిమాకే హైలెట్ అట‌!?

June 14, 2021 at 9:08 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా క‌నిపించ‌నున్నారు.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప‌రాజ్‌గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ చిత్రంలో పడవ ప్రయాణం బ్యాక్‌డ్రాప్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్ ను సుకుమార్ ప్లాన్ చేశాడ‌ట‌.

టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో బోట్ ఫైట్స్ ఉన్నాయి. కానీ.. వాట‌న్నింటికంటే భిన్నంగా, రిచ్‌గా పుష్ప బోట్ ఫైట్ ఉంటుంద‌ట‌. అంతేకాదు, ఈ బోట్ ఫైట్ సినిమాకు వన్నాఫ్‌ ది హైలైట్‌గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది. కాగా, క‌రోనా కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే స్టార్ట్ కానుంది.

`పుష్ప‌`లో బోట్ ఫైట్‌.. సినిమాకే హైలెట్ అట‌!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts