క‌ల నెర‌వేర్చుకున్న పూజా..సీక్రెట్స్ రివిల్ చేసిన బుట్ట‌బొమ్మ‌!

June 14, 2021 at 7:26 am

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు అందుకున్నా దువ్వాడ జగన్నాధమ్(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ త‌ర్వాత పూజా వెనుదిరిగి చూసుకోలేదు. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో ఇలా వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

అదే స‌మ‌యంలో తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఆచార్య, రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, సర్కస్‌, కభీ ఈద్‌ కభీ దీవాలి ఇలా ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న పూజా తాను క‌ల నెర‌వేరిందంటూ సీక్రెట్ రివిల్ చేసింది.

కెరీర్ తొలినాళ్ల‌లోనే పాన్ ఇండియాలో హీరోయిన్ కావాల‌ని త‌న‌కు ఓ క‌ల ఉండేద‌ని చెప్పుకొచ్చిన‌ పూజా.. ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ మొహంజోదారో స‌రిగ్గా ఆడ‌లేదని దాంతో త‌న ఆశ నిరాశ అయ్యింద‌ని చెప్పింది. అయితే ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తున్నా. ఇవన్నీ కూడా ప్యాన్‌ ఇండియా చిత్రాలే. కాబట్టి ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌ కావాలనే కోరిక నెరవేరిన‌ట్లే అని తెలుపుతూ ఆనందం వ్య‌క్తం చేసింది.

క‌ల నెర‌వేర్చుకున్న పూజా..సీక్రెట్స్ రివిల్ చేసిన బుట్ట‌బొమ్మ‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts