పెళ్లిపై వనితా షాకింగ్ కామెంట్స్ ..?

June 13, 2021 at 2:33 pm

వనిత విజయ్ కుమార్..ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వినపడుతోంది. ప్రముఖ సీనియర్ నటుడు అయిన విజయ్ కుమార్ కూతురే ఈమె. తెలుగులో దేవీ సినిమాలో హీరోయిన్ ప్రేమాకు అక్కగా నటించింది. అయితే ఈమె పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుందని పలువురు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వనిత కొన్ని టీవీ షోలల్లో నటిస్తోంది. ఆమె జీవితంలో గత కొన్ని రోజులుగా అనుకోని బాధలు చుట్టుముట్టినా ఎదురొడ్డి పోరాడుతోంది.

మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న వనిత నాలుగో పెళ్లికి సిద్దమవుతోందంటూ పుకార్లు వస్తున్నప్పటికీ ఆమె వాటని ఖండించింది. తాను ఇకపై పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదని, తన గురించి తప్పుగా రాయవద్దని వేడుకుంది. తన పిల్లలే తన జీవితంగా గడపగలనని, తనమీద నమ్మకం ఉందని ఆమె విన్నవించింది. ఆమె జీవితానికి సంబంధించి, వనితపై లేనిపోని విషయాలు తనపై రుద్దవద్దంటూ మీడియాను వేడుకుంది.

పెళ్లిపై వనితా షాకింగ్ కామెంట్స్ ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts