ఆస్పత్రిలో ప్రముఖ క్రికెటర్.. ఎందుకంటే..?

June 13, 2021 at 2:52 pm

క్రికెటర్లు గాయాలపాలవ్వడం ఈ మధ్య సాధారణమైపోయింది. అయితే ఒక క్రికెటర్ కి గాయం అయితే ఆ తర్వాత అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. తాజాగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయాల పాలయ్యాడు. పాకిస్థాన్​ సూపర్​లీగ్​లో శనివారం పీఎస్​ఎల్​లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున డుప్లెసిస్ మ్యాచ్ ఆడుతున్నాడు.​ ఆ టైంలో పెషావర్​ జల్మీతో జరిగిన మ్యాచ్​లో గాయాలపాలయ్యాడు. బౌండరీని ఆపేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అతడికి గాయమైంది.​ ఏడవ ఓవర్ లో బౌండరీ దిశగా బాలు కదులుతున్నప్పుడు ఫాఫ్​ డుప్లెసిస్​ డైవ్​ చేశాడు.

ఆ బంతిని అడ్డుకోబోయాడు. ఆ టైంలో నేరుగా వస్తున్న పాకిస్థాన్​ క్రికెటర్​ మొహమ్మద్​ హస్​నైన్ ఢీకొన్నాడు. ఆ సమయంలో డుప్లెసిస్​ తలకు బలంగా గాయమైంది. దీంతో నొప్పితో డుప్లెసిస్ తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత అతడిని సహచర ఆటగాళ్లు ఆస్పత్రిలో చేర్చించారు. ప్రస్తుతం క్వెట్టా గ్లాడియేటర్స్​ డగౌట్​లో డుప్లెసిస్​ విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఆస్పత్రిలో ప్రముఖ క్రికెటర్.. ఎందుకంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts