ప్రభాస్ `రాధే శ్యామ్` రిలీజ్ డేట్ వచ్చేసింది!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఇట‌లీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వింటేజ్‌ ప్రేమ‌క‌థగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. కరోనా వల్ల పలుమార్లు నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ గురువారంతో పూర్తి అయింది. అయితే తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట‌ర్‌ను షేర్ చేసింది […]

‘మా’ ఎన్నికలపై క్లారిటీ వచ్చేది అప్పుడేన‌ట‌?!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్య‌వ‌హారం రోజు రోజుకు ఉత్కంఠ‌గా మారుతుంది. మా ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనీ కొంతమంది.. ఎన్నికలు పెట్టాలని మరికొంత‌మంది వాదిస్తున్నారు. అయితే ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం మార్చిలోనే ముగియడంతో ప్రస్తుత కమిటీలో ఉన్న కొందరు తక్షణమే ఎన్నికలు జరిపాలంటూ క్రమశిక్షణా సంఘం కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజుకి లేఖలు రాశారు. ఈ నేప‌థ్యంలోనే గురువారం కృష్ణంరాజు నేతృత్వంలో ఆన్‌లైన్‌ ద్వారా ‘మా‘ కార్యవర్గ సమావేశం జరిగింది. అయితే ఈ స‌మావేశంలో పాల్గొన్న […]

భ‌ర్త కార‌ణంగా డైల‌మాలో ప‌డ్డ శిల్పాశెట్టి కెరీర్‌?!

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార‌వేత్త‌ రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత రాజ్ కుంద్రా గురించి ఎన్నో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తూ ఉన్నాయి. దాంతో కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా ముంబై కోర్టు కొట్టివేసింది. ఇక మ‌రోవైపు భ‌ర్త కార‌ణంగా శిల్పాశెట్టి కెరీర్ కూడా డైల‌మాలో ప‌డింది. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన శిల్పా ఇటీవ‌లె సెకెండ్ ఇన్నింగ్ స్టార్ చేసి హంగామా […]

ఏంటీ..`ప్రాజెక్ట్ కె`కు ప్ర‌భాస్ అన్ని డేట్స్ ఇచ్చాడా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. దీపికా పదుకొనే హీరోయిన్‌గా న‌టిస్తోంది. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో పాన్ వ‌ర‌ల్డ్ లెవ‌ల్‌లో అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె ఈ చిత్రం ప్రాజెక్ట్ కె వ‌ర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీద‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ […]

న‌టుడు పోసాని ఇంట క‌ల‌క‌లం రేపిన క‌రోనా!

సినీ ఇండ‌స్ట్రీలో ఎంద‌రో ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డి నానా ఇబ్బందులు ప‌డిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రైతే ప్రాణాలు కూడా విడిచారు. ఇదిలా ఉంటే.. తాజాగా సినీ న‌టుడు పోసాని కృష్ణ మురళి ఇంట క‌రోనా క‌ల‌క‌లం రేపింది. పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పోసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని పోసాని స్వయంగా వెల్లడించాడు. ఇక గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స తీసుకుంటున్నారు. ఇక […]

కేటీఆర్‌ను సాయం అడిగిన ర‌ష్మి..దేనికోస‌మంటే?

బుల్లితెర అందాల యాంక‌ర్స్‌లో ఒక‌రైన ర‌ష్మి గౌత‌మ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపుల‌ర్ అయిన ఈ భామకు జంతువులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. మూగ జీవాలపై తన ప్రేమను చాటుతూ ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతూనే ఉంటుంది. అలాగే లాక్‌డౌన్‌లో వీధి కుక్క‌ల ఆక‌లి తీర్చి అంద‌రి మెప్పు పొందిన ర‌ష్మి.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను […]

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన‌ హీరో సుమంత్‌!

అక్కినేని నాగేశ్వరరావు మ‌న‌వుడు, టాలీవుడ్ హీరో సుమంత్ త్వ‌ర‌లోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గ‌త రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. పవిత్ర అనే అమ్మాయితో సుమంత్ వివాహం జ‌ర‌గ‌బోతోంద‌ని ఓ కాస్ట్లీ వెడ్డింగ్‌ కార్డ్ కూడా వైరల్‌ అవుతోంది. అయితే ఈ వార్త‌ల‌పై సుమంత తాజాగా స్పందిస్తూ.. అంద‌రికీ ఓ క్లారిటీ ఇచ్చాడు. తాను రెండు పెళ్లి చేసుకుంటున్నాన‌ని వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజ‌మూ లేద‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ వీడియో రూపంలో సుమంత్‌ […]

ఎన్టీఆర్ షోలో చ‌ర‌ణ్ ఎంత గెలిచాడో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్వ‌రలోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జెమినీ టీవీలో ప్ర‌సారం కాబోయే `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు మెగా ప‌వ‌ర్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చిన‌ట్టు ఎప్ప‌టి నుంచో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింద‌ని.. ఆగ‌స్టు 16న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు […]

థియేటర్లలో మెరవబోతున్న ‘మెరిసే మెరిసే’

సూపర్ హిట్ ఫిల్మ్ ‘హుషారు’ యూత్‌కు ఎంతో నచ్చిన సినిమా. ఇందులో నటించిన దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. ఈ చిత్ర ట్రైలర్‌ను యంగ్ హీరో విశ్వక్‌సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ దినేష్ తేజ్, తాను ‘హుషారు’ మూవీ టైమ్ నుంచి మంచి ఫ్రెండ్సని, దినేష్ గ్రేట్ పర్మార్మర్ అని టాలెటెండ్ ఆర్టిస్ట్ అని తెలిపాడు. ఎన్ని ప్లాట్ ఫామ్స్ ఉన్నా, థియేటర్‌లో సినిమా చూసిన […]