థియేటర్లలో మెరవబోతున్న ‘మెరిసే మెరిసే’

July 29, 2021 at 4:57 pm

సూపర్ హిట్ ఫిల్మ్ ‘హుషారు’ యూత్‌కు ఎంతో నచ్చిన సినిమా. ఇందులో నటించిన దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. ఈ చిత్ర ట్రైలర్‌ను యంగ్ హీరో విశ్వక్‌సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ దినేష్ తేజ్, తాను ‘హుషారు’ మూవీ టైమ్ నుంచి మంచి ఫ్రెండ్సని, దినేష్ గ్రేట్ పర్మార్మర్ అని టాలెటెండ్ ఆర్టిస్ట్ అని తెలిపాడు. ఎన్ని ప్లాట్ ఫామ్స్ ఉన్నా, థియేటర్‌లో సినిమా చూసిన అనుభూతి వేరుగా ఉంటుందని చెప్పాడు. వచ్చే నెల 6న ‘మెరిసే మెరిసే’ థియేటర్‌లలో మెరవబోతున్నదని, ప్రేక్షకులు ఆదరించాలని కోరాడు విశ్వక్. సినిమా దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘మెరిసే మెరిసే’ సినిమాను ఆదరించాలని కోరారు. హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ సినమాను ఆదరించాలని కోరారు. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. పీవీఆర్ పిక్చర్స్ ద్వారా మూవీ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. లవ్, కామోడీ, ఎమోషన్స్‌తో కూడిన డ్రామా యూత్‌కు నచ్చే విధంగా సినిమా ఉంటుందని మూవీ యూనిట్ సభ్యులు తెలిపారు.

థియేటర్లలో మెరవబోతున్న ‘మెరిసే మెరిసే’
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts