‘ ఓజీ ‘లో ప్రభాస్ క్యామియో రోల్ పై సస్పెన్స్ క్లియర్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్‌ మూవీ ఓజి మరికొద్ది రోజుల్లో పాన్‌ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. కేవలం పవన్ అభిమానులే కాదు సాధారణ ఆడియన్స్ అయితే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి చిన్న అప్డేట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను కూడా దక్కించుకుంటూ సినిమాపై హైప్‌ మరింతగా పెంచుతుంది. ఇక మరికొద్ది గంటల్లో ఈ సినిమా నుంచి గన్స్‌ అండ్ హాస్టల్స్ &#038 రోజెస్ సాంగ్ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. సినిమా మొదటి సింగిల్ ఫైర్ స్ట్రామ్‌ మించిపోయేలా ఉందని చెప్తున్నారు.

OG's fiery first single 'First Blast' to hit on this date

హాలీవుడ్ మించిపోయే రేంజ్‌లో డైరెక్టర్ ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దినట్లు ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అనిపిస్తుంది. ఇలాంటి క్రమంలో సినిమాలు హైప్‌ పెంచే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదే ప్రభాస్ క్యామియో రోల్‌ ఈ సినిమాలో ప్రభాస్ క్యామియో పాత్రలో.. లేదా వాయిస్ ద్వారా ఆయన.. ఆడియన్స్‌ను పలకరిస్తాడంటూ ఎప్పటినుంచో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ప్రభాస్ సాహోగా కనిపించనున్నాడని.. ఓజి క్లైమాక్స్లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని.. ఓజి, సాహూ మధ్యన జరిగే క్లాష్ ఓజీ పార్ట్ 2 గా తెర‌కెక్కించ‌చేలా.. ఓ ట్విస్ట్‌ చివర్లో డిజైన్ చేశాడ‌ని.. కావాలనే సుజిత్ దాని ఆడియన్స్‌ను థియేట‌ర్స్‌లో థ్రిల్ చేయడం కోసం సీక్రెట్ గా ఉంచాడని సమాచారం.

Always Prabhas on X: "Adv Happy Birthday Power Star Pawan Kalyan ❤️ From  Rebel star Prabhas Fans 🥰 #PrabhasBdayFestIn100Days #AdvanceHBDJanaSenani  https://t.co/XpizRp7vcy" / X

అయితే.. ఇప్పటికే సినిమా ఫస్ట్ కాపీ కూడా వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఎలాంటి సీక్రెట్స్ అయినా క్షణాల్లో వైరల్ గా మారుతాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ రోల్ తెగ ట్రెండింగ్ గా మారుతుంది. అయితే గతంలో ఈ వార్తలన్నీఫేక్ అని మేకర్స్ కొట్టి పడేసిన.. కావాలనే సుజిత్ సస్పెన్స్ మెయింటైన్ చేయడం కోసం దాన్ని అలా కవర్ చేస్తున్నాడు అంటూ సమాచారం. ఒకవేళ అదే నిజమై.. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఒకే స్క్రీన్ పై కనబడితే మాత్రం బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయిపోవడం ఖాయం. రికార్డులు ఎక్కడితో మొదలై.. ఎక్కడితో ఎండ్ అవుతాయో కూడా చెప్పడం కష్టమే. మరి నిజంగానే ప్రభాస్ కామియో పాత్రలో మీరుస్తాడా లేదా తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకు వేచి చూడాల్సిందే.