టాలీవుడ్‌లో ఆ హీరోయిన్ల‌ను తొక్కేస్తున్నారు.. అన‌న్య నాగ‌ళ్ల షాకింగ్ … !

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు అవకాశాల కోసం ప్రయత్నించిన అది వర్కౌట్ కాదని.. ఎవరు ఎంకరేజ్ చేయరని.. ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ హీరోయిన్స్ ప‌లు సందర్భాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. మరి కొంతమంది డైరెక్టర్, నిర్మాతలు మాత్రం తెలుగు అమ్మాయిలకు పిలిచి మరి అవకాశం ఇచ్చిన తర్వాత.. సక్సెస్ అందుకుని వాళ్ళు పొగరు చూపిస్తున్నారని పరోక్షంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే తాజాగా మరో హీరోయిన్ అనన్య నాగళ్ల‌ తెలుగు ఇండస్ట్రీపై సంచల కామెంట్లు చేసింది. ఇతర భాషల నుంచి వచ్చే హీరోయిన్లకు తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా ఆదరణ లభిస్తుందని.. మనవాళ్లను పక్కన పెట్టేసి మరి వాళ్ళని తీసుకుంటున్నారంటూ అనన్య‌ అభిప్రాయాలను వెల్లడించింది.

తెలుగు హీరోయిన్స్‌కి మన వాళ్ళు అవకాశాలు ఇవ్వక.. ఇతర భాషల వాళ్ళు అవకాశాలు ఇవ్వకపోతే.. నటనను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం అన‌న్య చేసిన ఈ కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. మల్లేశం సినిమాతో హీరోయిన్‌గా.. టాలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడు.. ఖమ్మం జిల్లా వాసి. తన అందం, అభినయంతో పాటు.. గ్లామర్ షోల‌తోను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. కొంత కాలంగా టాలీవుడ్‌లో హీరోయిన్గా నిలదొక్కుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తుంది. అయితే.. ఇవేవీ అమ్మడికి సరిగ్గా వర్కౌట్ కావడం లేదు. ఇటీవల వెన్నెల కిషోర్‌తో కలిసి శ్రీకాకుళం సినిమాలో నటించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని సందడి చేసింది.

ఇందులో భాగంగా అనన్య మాట్లాడుతూ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో 20 శాతం మంది మాత్రమే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయి. మిగతావన్నీ బయటనుంచి వచ్చిన వాళ్లకే దక్కుతున్నాయి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీంతో.. ఇతర భాషల్లో అవకాశాల కోసం ట్రై చేస్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని అక్కడ ఉన్నవారికి 80% అవకాశాలు ఇచ్చి మిగిలిన వారికి 20% మాత్రమే అవకాశాలు కల్పిస్తారు. కానీ.. ఒక్క టాలీవుడ్‌లో మాత్రమే మనవాళ్లకు 20% అవకాశాలు కలిగించి.. ఇత‌ర భాషల వాళ్ళకి 80% అవకాశాలు కల్పిస్తున్నారు. కానీ.. ఆ 20% లోనే చాలామంది ఇంకా స్ట్రాంగ్‌గా నిలబడి ఫైట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ వివరించింది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువ అయినా కూడా.. ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉండడం చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనన్య నాగళ్ళ చేసిన ఈ కామెంట్స్ పై టాలీవుడ్ ప్రముఖులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.