” థ‌గ్ లైఫ్‌ “లో శింబు రోల్ మిస్ అయిన స్టార్ హీరో… ఎంత ల‌క్కీరా బాబు…!

లోకనాయకుడు కమలహాసన్.. స్టార్ డైరెక్టర్ మణిర‌త్నం కాంబోలో తెర‌కెక్కిన తాజా మూవీ థ‌గ్ లైఫ్‌. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీళ్ళ కాంబోలో వ‌చ్చిన‌ సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో రిలీజ్ ముందు నుంచే మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక.. ఈ సినిమా తాజాగా రిలీజై ఎలాంటి టాక్‌ తెచ్చుకుందో తెలిసిందే. ఈ సినిమాలో మరో స్టార్ హీరో శింబు సైతం కీలక పాత్రలో న‌టించాడు. త్రిష హీరోయిన్ గా మెరిసింది. అయితే ఈ సినిమా ఎంత దారుణమైన రిజల్ట్ ను అందుకుందో తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే థ‌గ్ లైఫ్ సినిమాలో శింబు రోల్‌ను స్టార్ హీరో రిజెక్ట్ చేశాడంటూ.. ఆ స్టార్ హీరో చాలా లక్కీ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో వివ‌రాలేంటో ఒకసారి తెలుసుకుందాం.

STR 48': Not Kamal Haasan, Simbu to produce his film helmed by Desingh Periasamy | Tamil Movie News - Times of India

మలయాళ నటుడు దుల్క‌ర్‌ సల్మాన్‌కు సౌత్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న ఆయన.. తాజాగా టాలీవుడ్‌లో లక్కీ భాస్కర్‌తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. కమర్షియల్ బాక్స్ ఆఫీస్ హిట్గా నిలవడమే కాదు.. కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే.. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే రెండు భారీ డిజాస్టర్ సినిమాలను తప్పించుకున్నాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. వాటిలో కమల్ హాసన్ తాజాగా నటించిన థ‌గ్ లైఫ్‌ సినిమా ఒకటి. ఈ సినిమాలో శింబు రోల్ కోసం మొదట దుల్కర్ సల్మాన్‌ని సంప్రదించారట.

Silambarasan TR To Replace Dulquer Salmaan In Kamal Haasan Starrer Thug Life? | Republic World

కానీ.. ఈయన ఏదో కారణంతో ఈ సినిమా రిజెక్ట్ చేశాడు. ఈ సినిమా ఎలాంటి దారుణమైన రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఇక దుల్కర్ సల్మాన్ రిజెక్ట్ చేసిన మరో సినిమా ఇండియన్ 2. ఈ సినిమాలోను కమలహాసన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాల్లో సిద్ధార్థ ఓ కీల‌క‌ పాత్రలో నటించారు. మొదట సిద్ధార్థ్‌ రోల్ కోసం.. దిల్కర్ సల్మాన్‌ను భావించారట. కానీ.. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో సిద్ధార్థ్ ఆ పాత్రలో మెరిసాడు. సినిమా ఎంత డిజాస్ట‌ర్‌గా నిలిచిందో తెలిసింది. ఇప్పుడు థ‌గ్‌ లైఫ్‌ కూడా ఇదే బాటలో మరో ఇండియ‌న్ 2 గా అవతరించనుంది అంటూ విమర్శకుల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి క్రమంలోనే దుల్కర్ సల్మాన్.. కమలహాసన్ నటించిన ఈ రెండు కళకండం నుంచి తప్పించుకొని మంచి పని చేశాడంటూ.. సల్మాన్ చాలా లక్కీ అంటూ.. అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.