హిట్ కావలసిన తారక్ మూవీని అట్టర్ ప్లాప్ చేసిన ఆ స్టార్ హీరో.. మూవీ ఏదంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తారక్.. తర్వాత దేవర తో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న వార్ 2, డ్రాగన్ సినిమాలపై కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా.. తారక్ సినీ కెరీర్ ప్రారంభం నుంచి కూడా ఎన్నో బ్లాక్బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అలా గ‌తంలో ఎన్టీఆర్ నటించిన ఓ సినిమా హిట్ అవ్వాల్సి ఉండగా.. మరో స్టార్ హీరో ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కు కారణం అయ్యాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. సినిమా హిట్ కాకుండా అడ్డుకున్న ఆ స్టార్ హీరోలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.

Ashok (film) - Wikipedia

ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో.. టీవీలో సంచలన రిజల్ట్ అందుకున్న సినిమా అంటే.. ముందు గుర్తొచ్చేది అశోక్. ఈ సినిమా ధియేటర్లలో హిట్ అందుకోకపోయినా.. బుల్లితెరపై మాత్రం బ్లాక్ బస్టర్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో.. తారక్‌, ప్రకాష్ రాజ్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఇక మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకి హైలెట్గా నిలిచింది. ప్రతి ఒక్క యాక్టర్ తమ నటన పరిధిలో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే.. అంతలా అన్నీ వర్కౌవుట్ అయినా.. కథలో పట్టులేదని.. ఈ కారణంతోనే సినిమా ఫెయిల్ అయిందని.. అప్పట్లో చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Pokiri Movie - Ippatikinka Song With Lyrics - Mahesh Babu ,Ileana - Aditya  Music | Telugu Item Songs - YouTube

ఇక ఈ సినిమా తర్వాత నుంచి క‌థ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడ‌ట తార‌క్‌. కాగా.. ఈ సినిమా కలెక్షన్లు కొల్లగొట్టక పోవడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఈ సినిమాలో సీరియస్ యాక్టింగ్.. కామెడీ మచ్చుకైనా లేకపోవడం. అలాగే.. సినిమా రిలీజ్ టైంకి మహేష్ బాబు – పోకిరి, రవితేజ – విక్రమార్కుడు, సిద్ధార్థ – బొమ్మరిల్లు సినిమాలు మంచి ఫామ్ లో థియేటర్లలో సందడి చేస్తున్నాయి. దీంతో అశోక్ సినిమాను చూడడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. అలా.. పరోక్షంగా ఈ సినిమా ప్లాప్ కావడానికి మహేష్ బాబు, రవితేజ ,సిద్ధార్థ్‌లు కారణమయ్యారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ సమీరా రెడ్డితో.. తారక్ కెమిస్ట్రీ అసలు వర్కౌట్ కాలేదని అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. అలా.. సినిమా ధియేటర్లలో అట్టర్ ప్లాప్ గా నిలిచింది.

Re-release trend continues in Tollywood: Raviteja's Vikramarkudu to join  the bandwagon soon..! | Telugu Movie News - Times of India