ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఈమె టాలీవుడ్ క్రేజీ బ్యూటీ. టాలీవుడ్ లోనే కాదు దక్షిణాదిలోనే హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలకు హోస్ట్ గా, అటు నిర్మాతగా, మరోపక్క మ్యూజిక్ వీడియోలను కూడా చేస్తూ మల్టీ టాస్క్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత హీరోయిన్ గా మారి ఫిల్ గుడ్ సినిమాల్లో నటిస్తూ యూత్ ను ఆకట్టుకుంది.
తన అందం, అభినయంతో కుర్ర కారును కట్టిపడేసింది. దానికి తగ్గట్టుగానే టాలెంట్ తోనూ.. క్రేజీ ఎక్స్ప్రెషన్స్ తోనూ ఆడియన్స్ ను ఫిదా చేస్తుంది. అతి చిన్న వయసులోనే పెళ్ళి చేసుకుని సెటిల్ అయినా.. ఈ అందాల తార క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఈమె భర్త కూడా పాన్ ఇండియన్ స్టార్ కావడం విశేషం. ఇంతకీ ఈమె ఎవరు గుర్తుపట్టారా. అది కాప్త కష్టం లేండి.. మేమే చెప్పేస్తాం. ఆమె మరెవరో కాదు.. స్టార్ బ్యూటీ నజరియా. రాజా రాణి సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నజరియా.. అంతకుముందు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. తర్వాత కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించి అకట్టుకుంది.
కాగా.. రాజా రాణి తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఎక్స్ప్రెషన్స్ క్వీన్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తర్వాత బెంగళూరు డేస్ తో అమ్మడి స్టార్‌డం మరింతగా పెరిగింది. అయితే కెరీర్ స్పీడ్గా ఉన్న సమయంలోనే మళయాళ స్టార్ హీరో ఫాహద్ ఫజిల్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మళ్లీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది నజరియ. అలా గతఏడాది నానితో అంటే సుందరానికి సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఇక నజ్రియా భర్త ఫాహద్ ఫజిల్.. పుష్ప సినిమాల్లో విలన్ గా ఓ పవర్ఫుల్ రోల్‌లో నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే తెరకెక్కనున్న పుష్ప2 లోనూ ఫాహద్ నటించాడు.