స్కూల్ బుక్స్ లో తమన్నా లైఫ్ స్టోరీ.. మండిపడుతున్న తల్లిదండ్రులు..?!

మిల్కీ బ్యూటీ తమన్నాకు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. భాష‌తో సంబంధం లేకుండా వ‌రుస‌ సినిమాలతో నటిస్తూ దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దగ్గర పడుతున్న ఇప్పటికీ అదే క్రేజ్‌తో రాణిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ తన సత్తా చాటుకుంటుంది. త‌న‌ అందం, నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులు చూపు పక్కకు తిప్పుకోకుండా చేసే ఈ అమ్మ‌డు ఏకంగా 75 సినిమాల్లో నటించి రికార్డ్‌ క్రియేట్ చేసింది. కలై మామని, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులతో సహా ఎన్నో అవార్డులను దక్కించుకున్న తమన్నా.. దక్షిణాది ఫిలిం పేరు పురస్కారం కోసం 8 నామినేషన్లు, సాటర్న్ అవార్డుకు ఒక ప్రతిపాదనను దక్కించుకుంది. ఇలాంటి క్ర‌మంలో స్కూల్ బుక్స్ లో మిల్కీ బ్యూటీ తమన్న జీవిత చరిత్రను పాటంశంగా చేర్చడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.

Is Tamanna Bhatia hot? - Quora

బెంగళూరులోని హెబ్బాల్లా సింధి పాఠశాలలో ఏడో తరగతి పాఠ్య పుస్తకాల్లో తమన్నతో పాటు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ జీవిత చరిత్రలను పాఠ్యంశంగా టెస్ట్ బుక్కుల్లో చేర్చారు. సింధు వర్గం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా లెవెల్లో ఖ్యాతిని సంపాదించుకున్న నటులుగా రణవీర్ సింగ్, తమన్నా జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని స్కూల్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ఏడాది కొత్త పుస్తకాల్లో తమన్నతో పాటు రణ్‌వీర్ సింగ్ సినీ ప్రయాణాన్ని.. సాధించిన విజయాలు, అవార్డులను ఆవిష్కరిస్తూ ఓ పాఠ్యాంశంగా టెస్ట్ బుక్ లో చేర్చారు. ఈ నేపథ్యంలో తమన్న జీవిత చరిత్రను పాఠ్యాంశం స్కూల్ పుస్తకాల్లో పెట్టడంపై పేరెంట్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముందు ఆ పాఠం పుస్త‌కాల నుంచి తీయాలంటూ విద్యాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tamannaah: 7ம் வகுப்பு பாட புத்தகத்தில் தமன்னா குறித்த பாடம்.. கடுப்பான  பெற்றோர்! | Actress Tamannaah Bhatia Lesson In 7th Std Textbook - Tamil  Filmibeat

ఈ వివాదం పై చిల్డ్రన్ రైట్స్ కమిషన్ తో పాటు కర్ణాటక ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్ బోర్డ్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. ఆమె జీవితం నుంచి ఏడో తరగతి విద్యార్థులు ఎలా స్ఫూర్తి పొందుతారని.. వారికి ఆమె పాఠం అసలు సూటబుల్ కాదంటూ కంప్లైంట్ చేశౄరు. బోల్డ్, సెమి న్యూడ్‌ సినిమాలలో న‌టించిన‌ తమన్నా జీవితంను పాఠంగా స్కూల్ బుక్స్ లో చేర్చడం అసలు సమంజసం కాదంటూ యాజమాన్యం పై విమర్శలు కురిపించారు. అయితే తమన్నా లైఫ్ స్టోరీ పెట్టడంపై కర్ణాటక.. ప్రైమరీ సెకండరీ స్కూల్ బోర్డ్‌ కూడా సీరియస్ అయినట్లు సమాచారం. బోర్డ్‌ అనుమతి లేకుండా స్కూల్ సిలబస్ లో ఎందుకు ఈ పాఠాన్ని జోడించారంటూ.. వెంటనే తొలగించాలని ఆర్డర్లు పాస్ చేసినట్లు తెలుస్తుంది. రణ్‌వీర్ సింగ్ జీవిత చరిత్ర పై పేరెంట్స్ ఎలాంటి అభ్యంతరాలు తెలుపలేదని.. దీంతో కేవలం తమన్న పాఠాన్ని మాత్రమే తొలగించాట‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ తెగ వైరల్ గా మారింది.