ప్రతి పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఉండే గోలే ఇది .. మా హీరో తోపు అంటే మా హీరో తోపు అంటూ ఓ రేంజ్ లో పోట్లాడుకుంటూ ఉంటారు . ఇప్పుడు కూడా అదే జరుగుతుంది . మరి ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ నటించిన కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం సెన్సేషన్ల్ రికార్డ్స్ నెలకొల్పడం కొందరు ఫ్యాన్స్ కి నచ్చినట్టు లేదు . ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా గురించి నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు . సినిమా మొదటి రోజే 180 కోట్లు కలెక్ట్ చేసిన సరే మా హీరో రికార్డ్స్ బద్దల కొట్టలేదు అంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు .
ఇలాంటి మూమెంట్స్ లోనే పలువురు హీరోల ఫ్యాన్స్ మా హీరో నెంబర్ వన్ అంటే మా హీరో నెంబర్ వన్ అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ తో వార్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రభాస్ -బన్నీ – తారక్ – చరణ్ . ప్రెసెంట్ ఈ నలుగురు మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ అంతే స్ట్రాంగ్ గా కూడా జరుగుతుంది .
రీసెంట్ గా కల్కి సినిమా 180 కోట్లు క్రాస్ చేసింది . సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే మొదటి రోజు అత్యధిక వసూలు సాధించిన అతిపెద్ద మూడవ సినిమాగా చరిత్ర సృష్టించింది. అయినా ఏం లాభం ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డును బీట్ చేయలేకపోయింది . 223 కోట్లతో మొదటి స్థానంలో ఉంది ఆర్ ఆర్ ఆర్ సినిమా. ఇదే పాయింట్ బేస్ చేసుకొని ఇప్పుడు చరణ్ – తారక్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫాన్స్ హర్ట్ అయ్యే విధంగా మాట్లాడుకుంటున్నారు.
అయితే ప్రభాస్ ఫాన్స్ కూడా దానికి ఘాటుగా కౌంటర్స్ ఇస్తున్నారు. 217 కోట్లతో బాహుబలి 2 రెండవ స్థానంలో ఉంది ..అది కూడా ప్రభాస్ దే.. ఫస్ట్ టాప్ త్రీ ప్లేసుల్లో రెండు సినిమాలు ప్రభాస్ వే అంటూ రెబల్ ఫ్యాన్స్ ప్రభాస్ ని ఓ రేంజ్ లో పొగిడేసుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు రియల్ పాన్ ఇండియా హీరో ఎవరు అనే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మధ్యలో బన్నీ ఫాన్స్ పుష్ప2తో ఏకంగా 250 కోట్లు కలెక్ట్ చేసి ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను సైతం బద్దలు కొట్టబోతున్నాడు మా బన్నీ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు . ఇలా ఫ్యాన్స్ మధ్య ఫుల్ టఫ్ వార్ నెలకొంది..!!