నాగి ఇంత రొమాంటిక్ ఫెలోనా..? ప్రియాంక దత్ కి ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా..? వెరీ ఫన్నీ..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్వీన్ పేరే మారుమ్రోగిపోతుంది . ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఈ రేంజ్ లో ఆయన క్రేజ్ సంపాదించుకోవడం గమనార్హం. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మరీ ముఖ్యంగా ఆయన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం.

తన పర్సనల్ లైఫ్ ని ఎప్పుడు సోషల్ మీడియాలో పెట్టడు నాగ్ అశ్వీన్.. కానీ ఆయన ఫ్యాన్స్ ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ప్రియాంక దత్ తో ఎలా ప్రేమ పెళ్లి జరిగింది అనే విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాప్ ప్రొడ్యూసర్ అశ్వీనీదత్ కూతురే..ఈ ప్రియాంక దత్‌.. తన 21వ యేట 2004లో పవన్‌ కల్యాణ్‌ ‘బాలు’ చిత్రం ద్వారా సహనిర్మాతగా చిత్ర రంగంలోనికి ప్రవేశించారు.

ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలను ఆమె నిర్మించారు. త్రీ ఏంజల్స్ స్టుడియో పేరుతో పలు చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. ప్రియాంక కొన్ని యాడ్స్‌ కూడా నిర్మించారు. ఆ సమయంలో ఆమెకు నాగ్‌ అశ్విన్‌ పరిచయం కావడం.. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి యాదోంకీ బరత్ అనే లఘు చిత్రం కోసం పనిచేయడం ..అలా అలా ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంతో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. ప్రియాంక దత్‌కు తన ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఇలా ప్రపోజ్‌ చేశారట..

‘మీకు ఎవరైనా నచ్చితే సరే… లేదంటే మనం పెళ్లి చేసుకుందాం’ అని నాగ్‌ అశ్విన్‌ చాలా క్యూట్ గా డీసెంట్ గా తన ప్రేమ గురించి చెప్పాడట. ఈ విషయాని ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయానా చెప్పడం గమనార్హం. నాగ్ అశ్వీన్ – ప్రియాంక దత్ ని 2015 లో పెళ్లి చేసుకున్నారు..!!