వాట్.. ఒక్క స్వీట్ కార్న్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా.. అవేంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..?!

ప్రస్తుత రోజుల్లో స్వీట్ కార్న్ సీజన్ కు సంబంధం లేకుండా ఎక్కడపడితే అక్కడ లభిస్తుంది. సాధారణ లోకల్ మొక్కజొన్నతో పోలిస్తే దీనికి సీజన్ తో పనిలేదు. అయితే ఏడాది పొడవునా దొరికే ఈ స్వీట్ కార్న్ అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలామంది స్వీట్ కార్న్ ఉడకపెట్టి తినడానికి ఇష్టపడుతుంటారు. స్వీట్ కార్న్ ఉడికించి ఉప్పు, కారం, నెయ్యి లాంటివి చల్లుకుని ఆ రుచి ఆస్వాదిస్తారు. అయితే వాస్తవానికి స్వీట్ కార్న్ అంటే కేవలం ఒక చీరతుండగానే కాదు దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇలా స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

How to Boil Corn on the Cob Recipe - Love and Lemons

స్వీట్ కార్న్ లో పోలేట్ (విటమిన్ బి 9) పుష్కలంగా లభిస్తుంది. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి.. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. వారిలో ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఉత్ప‌న‌మ‌య్యేందుకు సహకరిస్తుంది. గర్భస్థ శిశువుకు ఈ కణాలు చాలా అవసరం. ఇక కడుపులో ఉన్న శిశువు ఎదుగుదలకు కూడా పోలేట్ కీలక పాత్ర వహిస్తుంది. కనుక గర్భిణీగా ఉన్న స్త్రీలు రోజు స్వీట్ కార్న్ ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఒక మీడియం సైజ్ స్వీట్ కార్న్ లో సుమారు 42 మైక్రోగ్రాముల పోలేట్ ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. సాల్య‌బుల్, ఇన్ సాల్య‌బుల్ ఫైబర్ రెండు ఇందులో లభిస్తాయి.

Sweet Corn Masala Recipe | How To Make Masala Sweet Corn

ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి సహకరిస్తాయి. ఇన్ సాల్య‌బుల్ ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరచడానికి.. మలబద్ధ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డానికి తోడ్ప‌డుతుంది. సాల్య‌బుల్ ఫైబర్ ప్రీబయోటిగ్గా పనిచేస్తుంది. జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాను ఇది తొలగిస్తుంది. స్వీట్ కార్న్ లో విటమిన్ బి, విటమిన్ బి త్రీ, విటమిన్ ఏ లాంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మెటబాలిజం.. చర్మ ఆరోగ్యం, ఇమ్యూనిటీ లాంటి వాటిపై ప్రభావం చూపుతాయి. నియాసిన్ వల్ల నాడీ మండల వ్యవస్థ పని తీరు మెరుగవుతుంది.

Corn Kadai

బ్రెయిన్‌ యాక్టివ్గా పనిచేస్తుంది. ఇది స్వీట్ కార్న్ లో సమృద్ధిగా ఉంటుంది. స్వీట్ కార్న్ లోటిన్, జియాజ్ యాంతిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు కూడ అందిస్తుంది. ఇవి వయసు మీద పడడం వల్ల వచ్చే కంటి వ్యాధులకు చెక్ పెడతాయి. కంటిచూపు మెరుగుపరచడానికి.. శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరచడానికి.. పొటాషియం శరీరంకు త‌గిన మోతాదులో అందించడానికి దోహదపడతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా స్వీట్ కార్న్ రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కనుక వీటిని ప్ర‌తిరోజు తినడానికి ప్రయత్నించండి.