సినిమా ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేయాలి అన్న ఆ రికార్డ్స్ బద్దలు కొట్టాలి అన్న స్టార్ల కే సాధ్యమవుతుంది . అలాంటి రికార్డ్స్ ను టైర్ 2 హీరోలు బద్దలు కొట్టలేరు . అయితే ఇప్పుడు ప్రభాస్ సాధించిన ఒక అరుదైన రికార్డ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1428 కోట్లతో బాక్సాఫీస్ వద్ద ఊచ కోత కోసేసి క్రేజీ రికార్డ్ అందుకున్న తొలి ఇండియన్ హీరోగా సంచలన రికార్డులు నెలకొల్పాడు . దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు మారు మ్రోగిపోతుంది .
నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి . దీపికా పదుకొనే – దిశా పటానీలు ఈ సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. అమితాబచ్చన్ కమల్ హాసన్ కీలకపాత్రలో నటించారు . అదేవిధంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ – నాని లాంటి హీరోలు కూడా గెస్ట్ పాత్రలో నటించారు . అంతేకాదు ఒకప్పటి సీనియర్ హీరోయిన్ శోభన కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ పాత్రలో కనిపించింది . మరి కొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలుపుకొని 270 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసి సత్తా చాటుకున్నింది కల్కి.
కాగా ప్రభాస్ నటించిన సాహో మూవీ రాధే శ్యామ్ మూవీ కాస్త డిసప్పాయింట్ చేసినప్పటికీ .. ఆ సినిమాలు వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలకు కలుపుకొని 203 కోట్ల మీద థియేట్రికల్ బిజినెస్ జరిగింది . అంతేకాదు బాహుబలి 2 తర్వాత సక్సెస్ అందుకోలేకపోయిన ప్రభాస్ నటించిన ఆది పురుష్ కూడా 240 కోట్ల మీద థియేట్రికల్ బిజినెస్ ను సాధించింది . ఇక సలార్ విషయానికి వస్తే ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కలుపుకొని 120 కోట్లు ప్రపంచవ్యాప్తంగా కలుపుకొని 345 కోట్ల వ్యాపారం చేసింది . కల్కి 2898 ఏడీ’ మూవీకి రికార్డు స్థాయిలో రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా ప్రభాస్ లాస్ట్ గా నటించిన ఐదు సినిమాలకు కలిపి ఏకంగా 1428 కోట్ల మీద ప్రీ బిజినెస్ జరిగింది . తద్వారా భారత సినీ చరిత్రలోనే ఇంత మొత్తంలో బిజినెస్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోగా ప్రభాస్ సంచలన రికార్డు నెలకొల్పాడు..!!