టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ గేమ్ చూంజర్. తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడం.. అలాగే ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను ఎప్పటినుంచో షూటింగ్ పూర్తి చేయకుండా స్లోగా చేస్తున్న శంకర్.. తాజాగా గేమ్ చేంజర్ కు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అలాగే రిలీజ్ డేట్ ను ఒకరోజు రిలీజ్ చేయాలని శంకర్ భావిస్తున్నాడట.
జులై 12న శంకర్ తీసిన భారతీయుడు 2 సినిమా రిలీజ్కానుంది. అదే రోజే గేమ్ చేంజర్ సినిమా టీజర్, రిలీజ్ డేట్ లో అనౌన్స్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో వార్తలు వైరల్ అవ్వడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ 12వ తేదీ శంకర్‌కు ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే రోబో తర్వాత ఒక్క సరైన హిట్ కూడా లేక సతమతమవుతున్న శంకర్‌కు ఈ రెండు సినిమాలతో మంచి సక్సెస్ అందుకోవడం చాలా ముఖ్యం.
లేదంటే ఆయన మార్కెట్ మరింతగా పడిపోతుంది అనడంలో సందేహం లేదు. ఎట్టి పరిస్థితులను ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో వస్తున్నాయి రెండు సినిమాలు మంచి సక్సెస్‌లు అందుకోవాలని అయన కూడా చాలా కసితో పని చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే చరణ్ గేమ్ చేంజర్ నుంచి వచ్చే టీజర్ ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. కాగా ఒకే రోజున రిలీజ్ అవుతున్న ఇండియన్ 2, సినిమా గేమ్ చేంజర్ టీజర్‌లు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో వేచి చూడాలి.