వావ్: వాట్ ఏ కం బ్యాక్..అక్కినేని ఫ్యామిలీ మామ అల్లుడు రాబోతున్నారోచ్..!

ఇది నిజంగా అక్కినేని అభిమానులకి వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాలి . అక్కినేని ఫ్యామిలీ హీరోలను సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ చేస్తూ ఉంటారు మనకు బాగా తెలిసిన విషయమే.  కాగా అలాంటివి పెద్దగా పట్టించుకోని అక్కినేని హీరోలు తమదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉంటారు . అక్కినేని ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లలో  హీరో సుమంత్ కూడా ఒకరు . కెరియర్ స్టార్టింగ్ లో మంచి మంచి సినిమాలో నటించిన ఆ తర్వాత పర్సనల్ లైఫ్ పరంగా ప్రొఫెషనల్ లైఫ్ పరంగా డిజాస్టర్ గా మారాడు .
ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసిన సుమంత్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి ఆయనకు పెద్ద గుర్తింపు రాలేదు. తాజాగా ఆయన మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు నాగార్జున నటించబోయే వందవ సినిమాతో భారీ కం బ్యాక్ ఇవ్వబోతున్నడట . అక్కినేని సుమంత్ ఈ సినిమాలో నాగార్జునకు ధీటుగా ఉండే క్యారెక్టర్ లో నటించబోతున్నారట.
ఇది ఓ ప్రేమకథా చిత్రంగా తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో వచ్చే సస్పెన్షన్ హైలెట్గా మారిపోతున్నాయట . ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది . అంతేకాదు వారాహి అనే సినిమాలోనూ అక్కినేని సుమంత్ నటించబోతున్నాడట . దీంతో మామ అల్లుళ్ళ కాంబోను తెరపై చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు..!!