నిండా కునుకు కూడా దొరకడం లేదు. రాత్రి సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడటం ఉదయాన్నే బిజీ లైఫ్ స్టైల్‌లో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడంతో.. నిద్ర కూడా సరిపోక అలసట, చిరాకు, ఒత్తిడి, తలనొప్పి లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక నిద్రలేమి సమస్యతో అధిక బరువు, మధుమేహం, గుండెపోటు లాంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే రోజుల్లో ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు.
ప్రశాంతమైన నిద్రను అందించడానికి కొన్ని కొన్ని పానీయాలు ఎంతో అద్భుతంగా సహకరిస్తాయి. ఇప్పుడు చెప్పబోయే ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు ఇట్టే చెక్ పెట్టవచ్చు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ లో మూడు టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ సొంటిపొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసి ఆ పొడిని ఒక బాక్స్ లో నిల్వ ఉంచుకోవాలి.
ఆ తర్వాత ఒక గ్లాస్ పావు టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడి మరియు హాట్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఆ డ్రింక్ తీసుకోవడం వల్ల నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. నిద్రించే ముందు ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల హార్మోన్లపై ప్రభావం చూపించి ప్రశాంత నిద్రకు సహకరిస్తుంది. నిద్ర నాణ్యతను పెంచి నిద్రలేని ఇబ్బందులకు చెక్ పెడుతుంది. పైగా ఈ పానీయాన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. పొట్ట చుట్టూ పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ను కూడా ఇది కరిగిస్తోంది. కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి, బ్లడ్ ప్యూరిఫై చేయడానికి, అధిక బరువును తగ్గించడానికి ఈ డ్రింక్ తోడ్పడుతుంది.