వాట్.. ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల అలాంటి సమస్యలు వస్తాయా.. జాగ్రత్త..?!

ప్రస్తుత‌ రోజుల్లో ఫిట్నెస్ కోసం, బాడీ హెల్తీగా ఉండడం కోసం వ్యాయామాలు చేస్తూ కష్టపడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే రోజుకి అవసరాన్ని మించి వ్యాయామం చేయడం అసలు మంచిది కాదట. అధికంగా వ్యాయామం చేయడం వల్ల య‌ముక‌లు బలహీనంగా మారడంతో పాటు.. శరీరంలో కాలుష్యం లెవెల్స్ తగ్గి రోగనిరోధక శక్తిపై కూడా ప్రభావం చూపుతుందని నివేదికలు చెబుతున్నాయి.

కనుక ఓవర్ ట్రైనింగ్ లేదా ఎక్కువ ఎక్సర్సైజులు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. అధికంగా వ్యాయామం చేయడం వల్ల శరీరంపై స్థిర ఒత్తిడి కలిగి.. ఎముకలు పగుళ్లకు దారితీస్తుందని.. తీవ్రమైన గాయాలుగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే శరీరంలో కాలుష్య లోపం ఏర్పడి బలమైన ఎముకలు పెళ్ళుసుగా మారుతాయి అని ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తుంది.

అధిక వ్యాయామం రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుందట. ఓవర్ ట్రైనింగ్ శరీరంలో కర్డిసాల్ట్ స్థాయిని పెంచుతుందని.. ఇది రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో శక్తిలోపించి.. అలసట, బలహీనమైన అనుభూతి కలుగుతాయి. ఇది సిండ్రోమ్‌ వ్యాధికి సంకేతం. అలాగే నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. క‌నుక అధిక వ్యాయామ అల‌వ‌ట్లు మానుకుంటే మంచిది.