డ్రై ఫ్రూట్స్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల హెల్దీగా ఉంటారని అంత భావిస్తారు. వాటిలో ముఖ్యంగా బాదం చాలామంది డైట్ లో ఉంటుంది. అందులో ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో నాన్ వెజ్ తినలేని వారికి కూడా కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి. ప్రోటీన్స్ అధిక మొత్తంలో ఉంటాయి కనుక వైద్యులు కూడా వీటిని డైట్ లో చేర్చుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు బాదం ఇవ్వాలని, వెయిట్ లాస్ వర్కౌట్లు చేసేవారు బాదం తినాలని వారు చెప్తారు. అయితే బాదం అధికంగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయట. దీంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అధికంగా బాదం తినడం వల్ల ఆ ప్రభావం మనం శరీరంపై కనిపిస్తుంది.
బాధ ఎక్కువగా తినడం వల్ల ఎలర్జీ సమస్యలు తలెత్తుతాయని కొంతమందిలో ఇది మరీ అధికంగా దురద, వాపు లాంటి సమస్యలకు దారితీస్తుందని ప్రాణాంతకం అని చెబుతున్నారు. అందుకే వైద్యుల సలహా మేరకు వారు చెప్పిన మొతాదులోనే బాదం సేకరించాలి. నిజానికి బాధంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే అతిగా బాదం తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలిగి గ్యాస్, అజితి సమస్యలు తలెత్తుతాయి. అలాగే బాదంను సరిగ్గా నమలకపోయినా ఇలాంటి సమస్యలు వప్తాయి. బాదం గింజలు ఆక్సలైట్స్ కలిగి ఉంటాయి. అయితే అధికంగా బాదం తినడం వల్ల.. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
అలాగే ఆక్సలైట్ సంబంధించిన ఇతర ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే అధికంగా ఉండే క్యాలరీల కారణంగా బరువు కూడా త్వరగా పెరుగుతారు. అలాగే కొన్ని నివేదికల ప్రకారం బాదం లో డేంజరస్ బ్యాక్టీరియాల్ ఉంటాయి. ఇందులో సల్మోనెలా బ్యాక్టీరియా ఉపయోగిస్తారు.. ఎక్కువ కాలం బాదంపప్పును నిల్వ ఉంచడానికి దీన్ని వాడుతూ ఉంటారు. అందుకే బాదంను నీటిలో నానబెట్టి తినాలి. అయితే అతిగా తినడం వల్ల కూడా అనారోగ్యం కారణం అవుతుంది. ఇక ఏదైనా అనారోగ్య సమస్యలు.. ఎలర్జీ సమస్యలు ఉంటే.. బాదం తినడం మంచిది కాదట.