జామ ఆకులను ఉపయోగించి హెయిర్ ఫాల్ను ఇలా అరికట్టండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టు ఊడిపోవడంతో ప్రతి ఒక్కరు నిరాశకు గురవుతున్నారు. కానీ మన చుట్టుపక్కల దొరికే వాటిని ఉపయోగించి మన హెయిర్ ఫాల్ ని అరికట్టవచ్చు అనే సంగతి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు.

మనకి అందుబాటులో ఉండే జామ ఆకులతో మన జుట్టును సురక్షితంగా ఉంచుకోవచ్చు. జామ ఆకుల్లో ఉండే విటమిన్ సి కారణంగా జుట్టు పోషకంగా ఉంటుంది. జామ ఆకుల్లో ఉండే కంటెంట్ ద్వారా జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి. అదేవిధంగా ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. జామ ఆకుల్లో యాంటీ బయోటిక్స్ ఉండడం ద్వారా జుట్టు ఊడడాన్ని అరికట్టుతాయి. అందువల్ల వారానికి రెండు రోజులు పాటు జామ ఆకులను పేస్ట్ కింద చేసి హెయిర్ కి అప్లై చేస్తూ ఉండండి. ఇలా చేసిన రెండు వారాలకే మీకు రిజల్ట్ కనిపిస్తుంది.