టాలీవుడ్ లో హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట ప్రభాస్ తో కలిసి ఈశ్వర్ సినిమాలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన సక్సెస్ కాలేకపోవడంతో సిస్టర్ పాత్రలలో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది శ్రీదేవి విజయ్ కుమార్.
అటు తమిళంలో కూడా వరుస సినిమాలలో నటించిన శ్రీదేవి వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను సైతం తెలియజేస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా శ్రీదేవి గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే త్వరలోనే బుల్లితెరపై స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ తమిళంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈమె సోదరీ వనిత విజయ్ కుమార్ కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనడం జరిగింది.
తమిళ నటుడు విజయ్ కుమార్ మంజుల దంపతులకు చిన్న కుమార్తెగా శ్రీదేవి విజయకుమార్ జన్మించింది. ఈమె చివరిసారిగా కన్నడలో లక్ష్మీ అనే సినిమాలో నటించింది. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు తమిళ బిగ్ బాస్ షో రియాల్టీ షో తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైన ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటన అయితే వెలుబడలేదు. ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ -7 లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మరి ఈ విధంగానైనా ఈమెకు క్రేజ్ వస్తుందేమో చూడాలి.