తెలుగు ఇండస్ట్రీలోకి కన్నడ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ కౌసల్య.. 1996 ఏప్రిల్ 19న ఈమె వెండితెరకు పరిచయమైంది. జగపతిబాబు హీరోగా నటించిన అల్లుడుగారు వచ్చారు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత శ్రీకాంత్ నటించిన పంచదార చిలక అనే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో నటించింది కొన్ని సినిమాలు అయినా మంచి క్రేజ్ అందుకుంది. ఆపై చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేక పోయింది.
2002 సంక్రాంతి కానుకగా విడుదలైన హీరో మూవీలో ఈమె చివరిగా కనిపించింది.. అయితే నాలుగు పదుల వయసు దాటినా కూడా కౌశాల్య ఇంకా వివాహం చేసుకోకుండా అలాగే ఉంది.. ఈ విషయంపై పలు కారణాలను తెలియజేసింది.. కౌసల్య వివాహ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదు అంటూ.. సరైన వ్యక్తి భర్తగా వస్తే జీవితం చాలా అందంగా ఉంటుంది నాకు తగినవాడు దొరుకుతాడు దొరకడేమో అని చాలా ఆందోళన పడ్డాను ఎందుకో తెలియదు రిలేషన్ అంటే తనకు సెట్ కాదనిపించింది అని తెలిపింది.
అందుకే తన తల్లిదండ్రులతోనే ఉండిపోయానని తల్లిదండ్రులతో ఉన్నప్పుడు తనకు పెళ్లి ఆలోచన వచ్చింది… అయితే అత్తమామలతో నేను ఇమడగలనా అనే సందేహం అందరిలోనూ కలిగింది.. ఇలాంటి భయంకరమైన ఆలోచనలు తనని పెళ్లికి దూరం చేశాయని తెలుపుతోంది. దానికి తోడు అనారోగ్యానికి గురయ్యాను బరువు కూడా పెరిగిపోయాను సినిమాలు ఫెయిల్ అయ్యాయి దీంతో అన్నిటి నుంచి బ్రేక్ తీసుకున్నానని తెలియజేసింది కౌసల్య.. మొత్తంగా ఈమె మాటలను బట్టి చూస్తే లైఫ్ లాంగ్ ఇమే పెళ్లి చేసుకోకుండా ఉంటుందేమో అని అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.