విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఖుషి`. నిన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదలై.. పాజిటిక్ టాక్ ను సొంతం చేసుకుంది. చాలా కాలం నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శివ నిర్వాణకు ఖుషి కొత్త ఉత్సాహాన్ని అందించింది. టాక్ అనుకూలంగా ఉండటంతో.. ఖుషి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా డైరెక్టర్ శివ నిర్వాణ ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అక్కడ ఓ రిపోప్టర్.. ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత లిప్ లాక్ సన్నివేశాల గురించి ప్రశ్నలేవనెత్తారు. `సమంత-విజయ్ మధ్య రెండు లిప్ లాక్స్ పెట్టారు.. అది కూడా ఒక సాంగ్ లో.. అవి అంత అవసరమా..?` అంటూ ప్రశ్నించారు. అందుకు డైరెక్టర్ శివ నిర్వాణ ఏ మాత్రం తడపబడకుండా సదరు రిపోర్టర్ కు స్ట్రోంగ్ రిప్లై ఇచ్చాడు.
`ఆరాధ్య అనే పాత్రకు అది అవసరమే. ప్రేమ, పెళ్లి, పిల్లలు.. అన్న ఎమోషన్ పెట్టినప్పుడు ఆ చిన్న ముచ్చట కూడా లేకపోతే అర్థం ఉండదు. ప్రేమ ఎమోషన్ చెప్పడానికి లిపి లాక్ అవసరమే. కొంచెం సహజంగా కనిపించాలి. వాళ్లు నిజంగానే భార్యాభర్తలుగా ఉన్నారనే ఫీలింగ్ రావాలి. అది జనం నమ్మాలి. అందుకే లిప్ లాక్స్ పెట్టా` అంటూ శివ నిర్వాణ అన్సర్ ఇచ్చాడు. దీంతో ఈయన వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.