టాలీవుడ్ లవబుల్ కపుల్స్ లిస్ట్ లో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి జోడీ ఒకటి. ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని ప్రణతిని ఎన్టీఆర్ 2011 మే 5వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. నార్నే శ్రీవివాసరావు కూతురే లక్ష్మీ ప్రణతి. అప్పట్లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి పెళ్లి బడ్జెట్ దాదాపు వంద కోట్లు ఉంటుందట.
అలాగే రూ. 18 కోట్లు ఖర్చు చేసి పెళ్లి మండపాన్ని నిర్మించారట. అప్పట్లో వీరి వివాహానికి 3 వేల మంది అతిథులు, 12 వేల మంది అభిమానులు హాజరు అయ్యారు. ఇక లక్ష్మీ ప్రణతి పెళ్లి చీర ఖరీదెంతో తెలిస్తే వారం రోజులు నిద్రపోరు. బంగారు వర్ణంతో ఉన్న పట్టు చీరలో ప్రణతి పెళ్లి రోజు అందంగా మెరిసిపోయింది. అయితే ఈ చీరను స్వచ్ఛమైన బంగారం, వెండితో ప్రత్యేకంగా తయారు చేయించారట.
ఈ చీర ఖరీదు అక్షరాల కోటి రూపాయిలు ఉంటుందట. చీరకు తగినట్లుగానే ప్రణతి ఒంటి నిండా ఖరీదైన ఆభరణాలు ధరించింది. అవి ఆమె అందాన్ని మరింత పెంచాయి. మరోవైపు ఎన్టీఆర్ వైట్ కుర్తా, దోతీలో మెరిశాడు. అన్నట్లు వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అభయ్ రామ్ కాగా.. చిన్నోడు భార్గవ్ రామ్. భార్గవ్ అచ్చం ఎన్టీఆర్ మాదిరిగానే ఉంటాడు. షూటింగ్స్ నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఎన్టీఆర్ భార్య, పిల్లలను తీసుకుని వెకేషన్ కు వెళ్తుంటాడు. కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` మూవీతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.