ముద్దు కోసం త‌మ‌న్నాను బ‌ల‌వంత పెట్టిన స్టార్ హీరో.. చివ‌ర‌కు ఏమైందో తెలిస్తే షాకే!?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా రీసెంట్ గా జీ క‌ర్దా, ల‌స్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ల‌తో నార్త్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు వెబ్ సిరీస్ ల‌లోనూ త‌మ‌న్నా రెచ్చిపోయి న‌టించింది. కిస్సింగ్ సీన్స్‌, ఇంటిమేట్ స‌న్నివేశాల్లో ఎలాంటి మొహ‌మాటం లేకుండా చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కెరీర్ ఆరంభం నుంచి త‌మ‌న్నా `నో కిస్సింగ్ రూల్` ను ఫాలో అవుతోంది. కానీ, ఇటీవ‌ల ఈ రూల్ ను బ్రేక్ చేసి ప‌డేసింది.

అయితే ల‌స్ట్ స్టోరీస్ 2 ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న త‌మ‌న్నా.. గ‌తంలో ముద్దు కోసం ఓ స్టార్ హీరో త‌న‌ను బ‌ల‌వంత పెట్టిన సంఘ‌ట‌న‌ను గుర్తు చేసింది. అస‌లేం జ‌రిగిందంటే.. కొన్నాళ్ల క్రితం ఓ స్టార్ హీరో మూవీలో త‌మ‌న్నా హీరోయిన్ గా ఎంపిక అయింది. షూటింగ్ కూడా ప్రారంభమైంది. త‌మ‌న్నా తాను ఫాలో అవుతున్న `నో కిస్సింగ్ రూల్` గురించి స‌ద‌రు మూవీ డైరెక్ట‌ర్ కు ముందే చెప్పించ‌ద‌ట‌.

అయినాస‌రే ఓ స‌న్నివేశంలో ముద్దు తప్పనిసరి అని స‌ద‌రు డైరెక్టర్ త‌మ‌న్నాను చాలా ఫోర్స్ చేశాడ‌ట‌. కానీ, త‌మ‌న్నా అందుకు ఒప్పుకోలేదట‌. ఈ విష‌యంలో త‌మ‌న్నా, స‌ద‌రు ద‌ర్శ‌కుడికి మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ కూడా జ‌రిగింద‌ట‌. దాంతో డైరెక్ట‌ర్ తన మొరని హీరో వ‌ద్ద చెప్పుకున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే హీరో రంగంలోకి దిగి.. ఆ సన్నివేశం లో నటించాల్సిందిగా త‌మ‌న్నాను బ‌ల‌వంత పెట్టాడ‌ట‌. అయిన‌ప్ప‌టికీ త‌మన్నా మాత్రం నో అనేసింద‌ట‌. స్టార్ హీరో అడిగినా కూడా కిస్సింగ్ సీన్ చేయ‌న‌ని చెప్పి షాకిచ్చింద‌ట‌. ఇక చేసేదేమి లేక ఆ స‌న్నివేశాన్ని తొల‌గించార‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని రీసెంట్ గా త‌మ‌న్నా రివీల్ చేసింది.