పెళ్లై ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా అందాల చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో బాలకృష్ణ `భగవంత్ కేసరి` ఒకటి కాగా.. మరొకటి కమల్ హాసన్ `ఇండియన్ 2`. అలాగే వీటితో పాటు `సత్యభామ` అనే మూవీకి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదొక లేడీ ఓరియెంటెడ్ మూవీ.
ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉండటంతో.. కాజల్ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేసింది. ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇండిస్ట్రీకి చెందిన హీరోయిన్స్ లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు..? అని ప్రశ్నించగా ఆమె సమాధానం ఇచ్చింది.
`రకుల్, తమన్నా, సమంత.. వీరు ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్. షూటింగ్ నుంచి ఖాళీ దొరికితే మేము నలుగురు కలిసి బయట హోటల్స్ లో ట్రైమ్ స్పెండ్ చేసేవాళ్లం. ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్లం. వాళ్లతో టైం స్పెండ్ చేయడం నాకు ఎంతో ఇష్టం` అంటూ చెప్పుకొచ్చిన కాజల్ రకుల్, తమన్నా, సమంతతో కలిసి దిగిన ఫోటోలను కూడా పంచుకుంది. కాగా, ఈ నలుగురు హీరోయిన్లు దాదాపు ఒకే టైమ్ లో కెరీర్ స్టార్ట్ చేశారు. దాంతో ఈ నలుగురి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. అలాగే ఈ నలుగురు తక్కువ సమయంలో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా పేరు సంపాదించుకున్నారు.