టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఏజ్ బార్ అవ్వకముందే ముంబైకి చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి పీటలెక్కింది. గత ఏడాది ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు. అయితే బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. సూపర్ ఫిట్ గా తయారై వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా కాజల్ తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ సెషన్ నిర్వహించింది.
ఈ సందర్భంగా వారు అడిగిన రకరకాల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధాలు చెప్పింది. డెలివరీ తర్వాత తాను డిప్రెషన్ తో బాధపడ్డానని.. అయితే కుటుంబసభ్యుల అండతో వెంటనే తాను ఆ దశ నుంచి బయటపట్టానని కాజల్ పేర్కొంది. ఇక ఈ క్రమంలోనే ఓ అభిమాని కాజల్ కు ఓ తుంటిరి ప్రశ్న వేశాడు. `నన్ను పెళ్ళి చేసుకుంటారా..?` అని అడిగేశాడు.
కాజల్ క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే సమాధానం.. `రెండున్నార ఏళ్ల క్రితమే ఆ అదృష్టం మరొకరిని వరించింది` అని అదిరిపోయే రిప్లై ఇచ్చింది. సాధారణంగా ఓ బిడ్డకు తల్లైక కూడా అలాంటి ప్రశ్నలు హీరోయిన్లు ఫైర్ అవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం చాలా కూల్ ఇచ్చిన సమాధానం అందరికీ ఆకట్టుకుంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఈ బ్యూటీ ఇప్పుడు బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న `భగవంత్ కేసరి`లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఇండియన్ 2, సత్యభామ వంటి ప్రాజెక్ట్ లు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.