విరూపాక్ష చిత్రంలో హీరోయిన్ తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

హీరో సాయి ధరంతేజ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన విరూపాక్ష సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఏప్రిల్ 20వ తేదీన విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది.

ఈ సినిమా రుద్రవరం అనే ఒక ఊరిపై చేతబడి జరిగిన కథ ఆదిశంతో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులను చాలా ఉత్కంఠ భరిచేలా చేసిందని చెప్పవచ్చు. ఇందులో హీరోయిన్ సంయుక్త తల్లితండ్రులను పూరి జనం తప్పుగా అర్థం చేసుకొని చెట్టుకు కట్టేసి తగలబెట్టేస్తారు.. దీంతో ఆమె ఈ ఊరు స్మశానమవుతుందంటూ శపిస్తుంది. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో ఊరు ప్రజలు భయపడుతూ ఉంటారు చివరికి ఏం జరిగిందని కథాంశంతో తెరకెక్కించారు.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త మీనన్ నటనకు అందానికి సైతం ఫిదా అయ్యారు ప్రేక్షకులు. హీరోయిన్ తల్లిగా చేసిన ఈమె కూడా హీరోయిన్ అన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈమె పేరు కామాక్షి భాస్కర్ల.. ఈమె గతంలో ప్రియురాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పొలిమేర, తదితర వంటి చిత్రాలలో నటించింది ఇటీవలే సైతాన్ వంటి వెబ్ సిరీస్లలో కూడా నటించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మా ఊరి పొలిమేర-2 లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Sai Kamakshi Bhaskarla Wiki, Biography, Age, Movies, Family, Images - News  Bugz

ఏది ఏమైనా ఇంతటి చిత్రాలలో నటించిన ఈ అమ్మడు విరూపాక్ష సినిమాలో నటించిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈమె నటించింది చిత్రాలన్నీ కూడా ఒక విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించడం జరిగింది. మరి ఈసారి పొలిమేర-2 చిత్రంతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందేమో చూడాలి మరి.