హాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని అందం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతం. వయసు 50కి చేరువవుతున్న సరే ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ తోటి హీరోలను కుల్లుకునేలా చేస్తున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మహేష్ బాబు సేమ్ లుక్‌ని మెయింటైన్ చేస్తున్నాడు అంటే అందుకు ఆయన హెల్తీ లైఫ్ స్టైల్ ప్రధాన కారణం. ఆరోగ్యమైన ఫుడ్ తో పాటు మహేష్ నిత్యం జిమ్ లో వర్కౌట్ చేస్తుంటాడు.
గతంలో చాలా సార్లు మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ లో.. జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియోలు పోస్ట్ చేశాడు. తాజాగా `మై శాటర్డే సిజిల్ సెట్.. నాకిష్టమైన స్కిల్‌మిల్ ఫినిషర్‌తో..` అంటూ మరో కొత్త వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియో చూస్తే కసరత్తులు చేసే మహేష్ కంటే మీకే ఎక్కువ చెమటలు పడతాయి. ఎందుకంటే మహేష్ అంతలా కష్టపడుతున్నాడు. మెరుపు వేగంతో కసరత్తులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
అలాగే మహేష్ బాబు ఏమేం వర్కౌట్స్ చేశాడో తెలిపాడు. ఒక నిమిషం పాటు ల్యాండ్ మైన్ ప్రెస్, నిమిషం కెటిల్ బెల్ స్వింగ్, మరో నిమిషం స్కిల్‌మిల్ రన్ చేసినట్టు తెలిపారు. తాను ఇవి చేయగలిగాను అని, మిరు ఎన్ని సెట్లు చేయగలరు..? అంటూ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మనీష్ గాబ్రియెల్, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ హీత్ మాథ్యూస్‌లతో పాటు ఫ్యాన్స్ కి ఛాలెంజ్ విసిరాడు. దీంతో ఈయన వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఈ మూవీకి దర్శకుడు. ఈ మూవీ అనంతరం మహేష్ బాబు రాజమౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయనున్నాడు.
https://www.instagram.com/reel/CuJl1OGsXPq/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==