వారివల్లే పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు రాబోతోందా..?

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో తన హవా కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలు రీ రిలీజ్ చేస్తూ అభిమానులను చాలా ఆనంద పరుస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టుకొని పలు రకాల విధ్వంసం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా రోడ్లమీద బైక్ ర్యాలీలు థియేటర్లలో స్క్రీన్లను చింపడం కుర్చీలను విరగగొట్టడం వంటివి చేయడం వల్ల పలు రకాల రూమర్లయితే వినిపిస్తున్నాయి.

Pawan Kalyan Is Charging Almost 50 Crores For 22 Days' Schedule Of  Vinodhaya Sitham's Remake?

ఇదే కాకుండా నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి పైన కూడా పలు రకాల కామెంట్స్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కు అభిమానులే చెడ్డ పేరు తీసుకొచ్చేలా కనిపిస్తున్నారని పలువురు నెటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త ఓవర్గా బిహేవ్ చేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక నిన్నటి రోజున తొలిప్రేమ సినిమా సెకండ్ షో సమయంలో అభిమానుల పేరుతో పెను భీభత్సవాన్ని సృష్టించారు సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో అని తెరచించేసి సీట్లు ధ్వంసం చేసి థియేటర్ యాజమాన్యాలకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నారు.

అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ అభిమానులు కావాలనే చేస్తున్నారా లేకపోతే ఎవరైనా చేస్తున్నారా అనే విజయం పై థియేటర్ యాజమాన్యం ఇది కుట్ర పూర్వకంగానే చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో విచారణ చేసి ధ్వంసం చేసిన వారిని శిక్ష విధించాలని థియేటర్ యాజమాన్యం పోలీసుల వారిని కోరుతోంది. మరి రాబోయే రోజుల్లో ఇలా చేస్తే రీ రిలీజ్ సినిమాలను కూడా ఆపివేయబోతున్నట్లు సమాచారం.