హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అజయ్ భపతి తెరకెక్కించిన `మహాసముద్రం` మూవీలో వీరిద్దరూ జంటగా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సిద్ధార్థ్, అదితి మధ్య ప్రేమ చిగురించిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
సిద్ధార్థ్, అదితి తరచూ చట్టాపట్టాలేసుకుని తిరగడం, సినిమా ఫంక్షన్స్ కు జంటగా వెళ్లడం వంటివి నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. ఇదే విషయాన్ని అదితి దగ్గర మీడియా వారు ఎన్నిసార్లు ప్రస్తావించినా.. ఇట్స్ మై పర్సనల్ అంటూ మాటదాటేస్తూ వచ్చింది. అయితే ఫైనల్ గా సిద్ధార్థ్ అదితి రావు హైదరితో ఎఫైర్ నిజమే అంటూ ఓప్పేసుకున్నాడు.
స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఓ డాన్స్ షోకి సిద్ధార్థ్ అతిథిగా హాజరయ్యారు. యాంకర్ శ్రీముఖి మీరు జీవితాంతం కలిసి డాన్స్ చేయాలని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అని అడగ్గా.. `మా ఊళ్ళో అతిథిదేవోభవ అంటారు` అని సిద్ధార్థ్ సమాధానం చెప్పారు. అంటే అదితి తన లైఫ్ టైం డాన్స్ పార్టనర్ గా ఉండాలనుకుంటున్నా అని సిద్ధార్థ్ పేర్కొన్నాడు. పరోక్షంగా ఆమెతో రిలేషన్ లో ఉన్నట్లు చెప్పకనే చెప్పేశాడు. దీంతో నెటిజన్లు `అన్నా మరి అదితితో పెళ్లెప్పుడు..?` అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.