రెండో పెళ్లికి రెడీ అయిన సమంత‌.. బాయ్ ఫ్రెండ్ ను కూడా ప‌రిచ‌యం చేసేసిందిరోయ్‌!?

సౌత్ స్టార్ బ్యూటీ సమంత రెండో పెళ్లికి సిద్ధం కాబోతోందని ప్రస్తుతం నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. 2017 లో ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్యతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గోవాలో వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కానీ పెళ్లై నాలుగేళ్లు గ‌డవక ముందే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.

ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లికి రెడీ అయ్యిందని వార్తలు ఉపందుకున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. సమంత ఒక వ్యక్తితో క్లోజ్ గా మాట్లాడుతూ వెనక నుండి దిగిన ఫోటో కూడా ఇందులో ఉంది. అంతేకాదు, ఈ పోస్ట్ కు సమంత `మూడ్` అంటూ క్యాప్షన్ ఇచ్చి లవ్ సింబల్ ను జోడించింది.

దీంతో సమంత రెండో పెళ్లికి రెడీ అయ్యిందని.. ఆ ఫోటోలో ఉన్న‌ది సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ నెటిజ‌న్లు తెగ చ‌ర్చించుకుంటున్నారు. త్వ‌ర‌లోనే స‌మంత ఓ ఇంటిది కాబోతోంద‌ని మాట్లాడుకుంటున్నారు. అయితే సమంత అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టి పడేస్తున్నారు. మ‌రి ఏది నిజ‌మో తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, స‌మంత ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండతో `ఖుషి` అనే పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ ధ‌వ‌న్ తో క‌లిసి `సిటాడెల్` అనే వెబ్ సిరీస్ చేస్తోంది.