బాలయ్య కు మాత్రమే సాధ్యమైన ఏకైక రికార్డ్ ఇదే..!

తెలుగు సినీ పరిశ్రమలో మాస్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు నందమూరి బాలకృష్ణ.. ముఖ్యంగా బాలయ్య తొడగొట్టే విధానంతో ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య తన మొదటి సినిమాతోనే నటనపరంగా ప్రశంసలు అందుకోవడం జరిగింది.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తండ్రికి తగ్గ కుమారుడు గా పేరు సంపాదించారు. ఒకవైపు అగ్ర కథానాయకుడుగా కొనసాగుతూనే మరొకవైపు రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు బాలయ్య.

Legendary Tollywood Trio to grace Balakrishna's Unstoppable
బాలయ్య కెరియర్ లో ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలలో నటించారు. ముఖ్యంగా బాలయ్య చెప్పే డైలాగులు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న నటులలో పారాణిక, జానపదం సాంఘికం సైన్స్ ఫిక్షన్ ఇలా ఎన్నో జోనర్లు పలు సినిమాలలో నటించి పేరు సంపాదించి అగ్ర కథానాయకుడిగా పేరు సంపాదించారు బాలయ్య.. తాతమ్మ కల అనే చిత్రంతో తెరగేట్రం చేశారు బాలయ్య.. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా మొదటి చిత్రానికి నటన పరంగా ప్రశంసలు అందుకున్నారు. దాదాపుగా వందకు పైగా సినిమాలలో నటించి మెప్పించారు బాలయ్య.

బాలయ్య గోన గన్నారెడ్డి, చెంఘిజ్ ఖాన్ వంటి పాత్రలో నటించాలని కోరిక ఉన్నదట. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘకాలంలో ఇప్పటివరకు ఒక రీమేక్ లో కూడా నటించలేదు. బాలయ్య ఈ ఘనత అప్పటి హీరోలలో కేవలం బాలకృష్ణకు మాత్రమే దక్కిందని చెప్పవచ్చు. ఇక బాలయ్య కెరియర్లో ఎన్నో ద్విపాత్రాభినయం పాత్రలలో 17 చిత్రాలలో బియల్ రోల్లో నటించారు. 1987లో బాలయ్య ఎనిమిది సినిమాలు విడుదల చేయడం జరిగింది.