దానికోసం బాలయ్య కుమారుడు సర్జరీ చేయించుకున్నారా..?

నరసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. గత కొన్నేళ్లుగా బాలయ్య కుమారుడు సినిమాలపై ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయం పైన ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ బాలయ్య మాత్రం త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మోక్షజ్ఞ లుక్ ను చూసి అభిమానులు బరువు తగ్గకపోతే హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేరని అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు.

Mokshagna Teja: Mokshagna is getting ready like slim NTR.. This look is not  normal | Nandamuri balakrishna son mokshagna tej latest look viral
ముఖ్యంగా మోక్షజ్ఞ లుక్స్ విషయంలో పలు విమర్శలను కూడా ఎదుర్కోవడం జరిగింది. అయితే నిన్నటి రోజున బాలయ్య పుట్టినరోజు సందర్భంగా తన కుమారుడు మోక్షజ్ఞ లుక్స్ మాత్రం ఫ్యాన్స్ ని కాస్త ఆనందపరిచేయాల కనిపిస్తున్నాయి.. స్లిమ్ లుక్ లో మోక్షజ్ఞ అందరిని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నట్లు కనిపిస్తోందని పలువురు నేటిజెన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఇలా వెంటనే బరువు తగ్గడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ల సర్జరీ చేయించుకున్నారా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి..

రాఖీ సినిమా తర్వాత ఎన్టీఆర్ సర్జరీ చేయించుకోగా మోక్షజ్ఞ మాత్రం నెగిటివ్ కామెంట్లు రావడం చేత బరువు తగ్గి సరికొత్త లుక్కుల కనిపించబోతున్నారు. బాలయ్య డైరెక్షన్లోనే మోక్షజ్ఞ మొదటి సినిమా ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిత్య -999 మ్యాక్స్ అనే టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం మోక్షజ్ఞ తొలి సినిమా అని సక్సెస్ సాధించాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.