చేతిలో బీర్ బాటిల్ ప‌ట్టుకుని ప‌బ్ లో `ఊ అంటావా మావ‌` అంటూ ఊపేసిన స‌మంత‌.. వీడియో వైర‌ల్!

స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లో `సిటాడెల్‌` అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజా అండ్ డీకే ద్వ‌యం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సిరీస్ లో వ‌రుణ్ ధావ‌న్‌, సమంత జంటగా నటిస్తున్నారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా న‌టించిన `సిటాడెల్`కు ఇండియ‌న్ వెర్ష‌న్ గా దీనిని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది.

షూటింగ్ గ్యాప్ లో స‌మంత అక్క‌డ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. లాస్ట్ నైట్ సమంత సిటాడెల్ యూనిట్ తో కలిసి సెర్బియాలోని ఓ పబ్ కి వెళ్ళింది. అక్కడ పుష్ప సినిమాలోని `ఊ అంటావా మావ‌` సాంగ్ ప్లే చేయడంతో.. సమంత డ్యాన్సులు వేస్తూ ఓ ఊపు ఊపేసింది. బ్లాక్ డ్రెస్ ధ‌రించిన స‌మంత‌.. చేతిలో బీర్ బాటిల్ ప‌ట్టుకుని వ‌రుణ్ ధ‌వ‌న్ తో క‌లిసి తెగ ర‌చ్చ చేసింది.

పబ్ కి వచ్చిన వాళ్లంతా కూడా ఆ పాటకు ఫుల్ గా డ్యాన్స్ వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. కాగా, స‌మంత సిటాడెల్ తో పాటు తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో `ఖుషి` అనే రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా కూడా న‌టిస్తోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ లో పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది.

https://twitter.com/RoshSamLover/status/1667475732975550467?s=20