బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న జాన్వికపూర్ .. తెలుగులో కూడా తన లక్ ని పరీక్షించుకోబోతున్న సంగతి తెలిసిందే . యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ 30 సినిమాలో అమ్మడు మొదటి హీరోయిన్గా నటిస్తుంది . డెబ్యూ తోనే ఇంత పెద్ద స్టార్ హీరోతో ఎంట్రీ ఇవ్వడంతో టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొల్పింది జాన్వి కపూర్. అయితే జాన్వి కపూర్ మొదటి సినిమాకే దాదాపు 5 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంసంగా మారింది.
జనరల్ గా మూడు నాలుగు హిట్ సినిమాలు పడితే కాని ఈ పారితోషకాని ఎక్స్పెక్ట్ చేయరు . అయితే జాన్వి మాత్రం మొదటి సినిమాకి 5కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం.. దానికి కొరటాల శివ కూడా యాక్సెప్ట్ చేయడం ఇండస్ట్రిలో షాకింగ్ గా ఉంది . అంతేకాదు ఎన్టీఆర్ 30 సినిమాకి జాన్వి కపూర్ ఓవర్ గా బిహేవ్ చేస్తుంది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి .
అసిస్టెంట్లు పిలిపించుకొని వాళ్ళ ఖర్చులు కూడా మొత్తం ఎన్టీఆర్ 30 మేకర్స్ భరించాలి అంటూ కండిషన్ పెట్టిందట . మొదటి నుంచి శ్రీదేవి పై ఉన్న అభిమానంతో ఇవన్నీ చూస్తూ వస్తున్న ఎన్టీఆర్ సైతం జాన్వి బిహేవియర్ పై మండిపడినట్లు తెలుస్తోంది . అంతేకాదు జాన్వి ఈ విషయంలో మేలుకోకపోతే కచ్చితంగా ఇండస్ట్రీలో ఆమెను తొక్కేసి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు . ఇప్పటికైనా జాన్వి మేల్కొని ఇలాంటి క్రేజీ కండిషన్స్ పెట్టకుండా ఉంటే ఇండస్ట్రీలో మంచి స్థానానికి వెళ్ళగలదు అంటూ చెప్పుకొస్తున్నారు..!!