తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఈరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా టిడిపి అభిమానులు రాజకీయ ప్రముఖులు ఆయన బర్తడే కి విషెస్ తెలియజేస్తూ ఉన్నారు. తన పుట్టినరోజు వేడుకలను చంద్రబాబు ఈరోజున ప్రకాశం జిల్లాలో జరుపుకోబోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు చంద్రబాబుకు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడుకు వెరైటీగా ఒక విషెస్ ని తెలియజేయడం జరిగింది.
చంద్రబాబు నాయుడుకు బర్తడే గిఫ్ట్ ఇస్తున్నానని మధ్యాహ్నం 12 గంటలకు సర్ప్రైజ్ ఉందని ఉదయాన్నే తెలియజేశారు.. ఆ సర్ప్రైజ్ రివిల్ చేయడం జరిగింది. అదే sickoPsycho అనే పాటను విడుదల చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని తెలియజేస్తూ పాటల రూపంలో సెటైర్స్ వేయడం జరిగింది.. అలాగే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉండి ఆ తర్వాత టిడిపిలోకి చేరి ఎన్టీఆర్‌కు ద్రోహం చేశాడు అంటూ ఈ పాటలు తెలియజేశారు. అలాగే నందమూరి కుటుంబం తమ జీవితాలను చంద్రబాబుకు ఎలా అంకితం చేశారు కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది.
అయితే ఈ పాట చంద్రబాబు నాయుడు పైనే కాకుండా నందమూరి కుటుంబం పైన కూడా పాడారు.. ఎన్టీఆర్ కు పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతుంది అంటూ వర్మ వివరించారు. గతంలో కూడా రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు మీద లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు బయోపిక్‌లు తీసి మంచి పాపులారిటీ సంపాదించారు.ఇప్పుడు సిక్కో సైకో పేరిట ఈ పాటను విడుదల చేయడం జరిగింది. కృత్రిమ మేదనే సాహిత్యం రాసి పాడిందని వర్మ సెటైర్ వేయడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
Happy birthday sir @ncbn here’s ur HISTORY in SickoPsycho Song created by #artificalintelligence https://t.co/HsklDCQhNa
— Ram Gopal Varma (@RGVzoomin) April 20, 2023