హీరోయిన్‌తో రొమాన్స్‌లో మునిగితేలుతున్న సిద్ధార్థ్.. !?

హీరో సిద్ధార్థ్ పేరు వినగానే మనకు లవర్ బోయ్ అని అంతా టక్కున అనేస్తారు. పలువురు హీరోయిన్లతో ఆయన సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు చేసిన సిద్దార్థ్ ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రేక్షకులను మెప్పించే సినిమాలు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా వస్తున్న టక్కర్ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన బిజ్ ఏర్పడింది. ఈ సినిమాకు కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ సరసన ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటించింది. టక్కర్‌ను ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధన్, జయరామ్ నిర్మించారు. అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్కాంత్, ఆర్‌జె విఘ్నేష్, రామ్‌దాస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా విడుదలైన టీజర్‌లో లిప్ సీన్‌ను ప్రేక్షకులన సంభ్రమాశ్చర్యంలో ముంచేశాయి. దివ్యాంశ కౌశిక్‌తో హీరో సిద్ధార్థ్ ఘాటు రొమాన్స్ చేశాడు. ఇది చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీపై గతంలో హీరో సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడిని టాలీవుడ్ దూరం పెట్టేసింది. ఆ మధ్య హీరో శర్వానంద్‌తో కలిసి మహాసముద్రంలో కనిపించాడు. బాక్సాఫీసు వద్ద ఆ సినిమా ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే టక్కర్ సినిమాను ఎప్పుడో పూర్తి చేసినా ఎందుకో అది వాయిదా పడింది. ఈ చిత్రం థ్రిల్లర్ డ్రామా జానర్‌లో సస్పెన్స్‌‌గా రూపొందింది.

ఇటీవల సిద్ధార్థ్ బర్త్ డే సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ వదిలి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందులో దివ్యాంశ కౌశిక్‌తో రొమాన్స్‌లో సిద్ధార్థ్ మునిగి తేలడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇక నిజజీవితంలో ఆయన అదితిరావు హైదరీతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ తరచూ ముంబై వీధుల్లో కలిసి తిరుగుతున్నారు. అంతేకాకుండా తరచూ వీడియోలు సోషల్ మీడియాలో విడుదల చేస్తూ, ఊహాగానాలు పెంచుతున్నారు.