బాలకృష్ణ సినిమాలు అంటేనే భారీ యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. ఆయన సినిమా వస్తుందంటేనే నందమూరి అభిమానులకు పండుగ. ఆయన నటించిన సినిమాల్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, ఈ సినిమా పేర్లు వినగానే నందమూరి అభిమానులకు మాత్రమే కాదు ప్రతి తెలుగు సినీ అభిమానులకు కూడా వైట్ అండ్ వైట్ ఖద్దర్ వేసుకున్న నటసింహం బాలయ్య గుర్తుకొస్తాడు.
ఆ సినిమాల్లో డైలాగ్లు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ‘నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా .. అని బాలయ్య గొడ్డలి పట్టుకుని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పినా’.. ‘కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా.. అని నరసింహనాయుడులో సింహగర్జన చేసిన’.. ‘కర్నూల్ చిత్తూర్ కడప.. ఏ సెంటర్ అయినా … చెమట పట్టకుండా చంపేస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య అభిమానులు థియేటర్ టాప్ లేచిపోయే రేంజ్ లో హంగామా చేసేవారు.
అలా బాలకృష్ణను ఫ్యాక్షన్ క్యారెక్టర్ లో చూసి థియేటర్లో విజిల్స్ వేసిన బాలయ్య వీర అభిమానుల్లో ఒకరైన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఎన్నో సంవత్సరాలో తన అభిమాన హీరోని ఒక అభిమానిగా థియేటర్లో చూసి ఇప్పుడు తానే దర్శకుడుగా వీర సింహారెడ్డి సినిమాను తెరకెక్కించాడు. ఓ వీర అభిమాని తన అభిమాన హీరోతో సినిమా చేస్తే తన అనుకున్న రీతిలో వింటేజ్ వైబ్స్ ఇవ్వాలి కదా.. తాను ఒకప్పుడు తన హీరోని ఎలా చూశాడో ఇప్పుడు అలానే చూపించాలని అనుకుంటాడు కదా. గోపీచంద్ మల్లిని కూడా అదే చేస్తున్నాడు.
వీర సింహారెడ్డి ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే వింటేజ్ బాలయ్య గుర్తుకొస్తు. తాజాగా ఈ సినిమా యూనిట్ నిన్న రాత్రి ఓ పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేయగా.. అందులో బాలయ్య వైట్ అండ్ వైట్ వేసి ఎంతో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ లో బాలయ్యను చూస్తుంటే మతులు పోతున్నాయి. మరి బాలయ్య వీర అభిమాని అయిన గోపీచంద్ మలినేని థియేటర్స్ లో వీర సింహారెడ్డి సినిమాతో బాలయ్య అభిమానులకి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడేమో చూడాలి.