కామెడీ, యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల చిత్రాలలో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంతగానో మెప్పించాడు మేక శ్రీకాంత్. మహాత్మ సినిమాలో అద్భుతంగా నటించి నంది అవార్డును కూడా ఈ టాలెంటెడ్ యాక్టర్ గెలుచుకున్నాడు. ఇప్పటికే 120 పైగా సినిమాలో నటించిన ఈ యాక్టర్ ఇంకా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. రీసెంట్గా అఖండ, కోతల రాయుడు, సన్ ఆఫ్ ఇండియా, కన్నడ చిత్రం జేమ్స్ సినిమాల్లో మెరిశాడు. అతడు నటించిన వారిసు మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ తనతో కలిసి నటించిన హీరోయిన్లతో తన అనుభవాలను పంచుకున్నాడు.
ముఖ్యంగా రోజా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఘటోత్కచుడు, తిరుమల తిరుపతి వెంకటేశ, క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాల్లో రోజా, శ్రీకాంత్ కలిసి నటించారు. అలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చాలామందిని ఆకట్టుకుంది. ఐతే వీరి వెండితెర రొమాన్స్ చూసి శ్రీకాంత్ – రోజా మధ్య రియల్ లైఫ్‌లోనూ ఏదో నడుస్తోంది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరి మధ్య అఫైర్ ఉందని వార్తలు కూడా వినపడేవి. అయితే తమ మధ్య అలాంటి రిలేషన్షిప్స్ ఏవీ లేవంటూ శ్రీకాంత్ పేర్కొన్నాడు. అలానే తనను రోజా అన్నయ్య అని పిలిచేదని చెప్పి షాక్ ఇచ్చాడు.
రోజా షూటింగ్ సమయంలో తనను అన్నయ్య అని చాలా ప్రేమగా పిలిచారట. ఏదైనా సన్నివేశం చేసే ముందు ఇలా చేద్దాం అన్నయ్య, అలా చేయటం అన్నయ్య అంటూ ప్రతి మాట వెనుక అన్నయ్య అనే ఒక పదాన్ని జోడించేదట. చివరాఖరికి రొమాంటిక్ సీన్స్‌లో కూడా అన్నయ్య అని చిరాకు పుట్టించేదట. అయితే ఒక రొమాంటిక్ సీన్ తీస్తుండగా అన్నయ్య అని పిలవగానే బాగా కోపం వచ్చి.. “ఎహే ఆపు.. అన్నయ్య అంటే నాకు రొమాంటిక్ మూడ్ రావడం లేదు” అంటూ శ్రీకాంత్ ఒకసారి మొహం మీద అనేసాడట. దాంతో రోజాతో పాటు సెట్స్ లో ఉన్న వారందరూ ఘళ్ళున నవ్వారని శ్రీకాంత్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.