మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్న సంగతి తెలిసింది. పెళ్లయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్ సతీమణి ఉపాసన గర్భం దాల్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఈ గుడ్ న్యూస్ తో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ దంపతులకు అభిమానులు మరియు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే ఒక్కరు మాత్రం తెగ బాధపడుతున్నారు. ఇంతకీ ఆ ఒక్కరు మరెవరో కాదు కాశ్మీరీ భామ సహీబా బలి. ఈమె అందరికీ గుర్తిండే ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో ఈ భామ రామ్ చరణ్ ను ఇంటర్వ్యూ చేసింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అయితే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అన్న వార్త బయటకు రాగానే.. సహీబా బలి ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
మీరు ఎంతో ఇష్టంగా అభిమానించే ఒక పర్సన్ మరో వ్యక్తితో లవ్లో ఉన్నా, డేటింగ్లో ఉన్నా, పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కన్నా అతను హ్యాపీగా ఉంటాడు. కానీ అంటూ వీడియోలో సహీబా బలి తెగ బాధపడుతూ కనిపించింది. దీంతో ఆమె పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రామ్ చరణ్ ను ఉద్దేశించే సాహిబా ఈ వీడియో పోస్ట్ చేసిందంటూ ప్రచారం జరగడంతో.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Zomato Interviewer Sahiba Bali Instagram status, Only Co Fan Girls can understand this i guess🥺❤️#RamCharan 👑🦁 pic.twitter.com/X1cc9AACh7
— Ujjwal Reddy (@HumanTsunaME) December 12, 2022